Telugu News Power

ఉపాధి శ్రామికులకు పక్షానికోసారి వేతనాలు ఇవ్వాలి.

తమ సమస్యలు వివరిస్తున్న ఉపాధి శ్రామికులు

పాలకొల్లు: జూన్, 4 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ఉపాధి శ్రామికులకు పనిచేసిన 15 రోజులకు ఒకసారి వేతనాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బాతిరెడ్డి జార్జ్ డిమాండ్ చేశారు. స్థానిక లంకలకోడేరు లో గురువారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ శ్రామికులను కలుసుకొని వారి సమస్యలను తెలుసుకున్నారు. కొన్ని గ్రామాల్లో రెండు నెలల వరకు ఉపాధి శ్రామికులకు వేతనాలు అందటం లేదని ఆరోపించారు. ఫోటోల కోసం మండుటెండలో శ్రామికులను గంటల తరబడి నిలబెట్టడాన్ని ఆయన నిరసించారు. వెంటనే ఈ పద్ధతి రద్దు చేయాలని సూచించారు. కొలతల ప్రకారం చేసిన పనికి, సొమ్ము చెల్లిస్తున్నప్పుడు, ఫోటోల అవసరం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా, శ్రామికులు, సత్యవతి, బుల్లబ్బాయి, దావీదు, జ్యోతి, కుటుంబరావు, విజయలక్ష్మి, రూతు, తమ సమస్యలు వివరించారు.