Telugu News Power

ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన బొర్రా గోపీమూర్తి.

అంబేద్కర్ ఆశీస్సులతో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ఎమ్మెల్సీ గోపి మూర్తి

యలమంచిలి:మే,5(తెలుగు మూవీస్ పవర్.కాం) పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలంలో తన స్వగ్రామైన నార్నిమెరక పంచాయతీ గమల్లపేటలో అంబేద్కర్ విగ్రహానికి, దివంగత టీచర్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జి చిత్రపటానికి, మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటాలకు పూలమాలలు వేసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పశ్చిమగోదావరి జిల్లా యుటిఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుపిఎస్ విజయరామరాజు, పోలిశెట్టి క్రాంతి కుమార్, రాష్ట్ర బాధ్యులు రామానుజ రావు జిల్లా కార్యదర్శి రామకృష్ణ యుటిఎఫ్ పూర్వపు రాష్ట్ర కార్యదర్శి ఎస్ జయప్రభ సిఐటియు నాయకులు దేవ సుధాకర్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వరహాల రాజు తాతాబ్బాయి ఫౌండేషన్ చైర్మన్ తిరుమల రాజు .బుంగ తాతబ్బాయి ఫౌండేషన్ చైర్మన్ సీనియర్ జర్నలిస్ట్ బుంగ ఎర్ర తిరుమల రాజు, జై భీమ్ యువసేన ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు గెడ్డం సునీల్ గవాస్కర్, డాక్టర్ బుర్ర శ్రీనివాస్ గారు, గ్రామ సంఘం మాజీ అధ్యక్షులు చిన్న వెంకటేశ్వరరావు, సెక్రటరీ పెద్ద వెంకటేశ్వర రావు, ట్రెజరర్ నర్సులు, తదితరులు హాజరయ్యారు
ఈ కార్యక్రమం ఉద్దేశించి ఉభయగోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి మాట్లాడుతూ, రాష్ట్ర సంఘం మరొక్కసారి తనకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధ్యాయులందరి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని, సమాజంలో అణగారిన వర్గాల ప్రశ్నించే గొంతుకవుతానని తన ప్రచారాన్ని ప్రారంభించారు.