Skip to main content

Telugu News Power

ఏపీ గ్రీన్ కార్యనిర్వాహక కమిటీ ఛైర్మన్‌గా కొణిదెల నాగబాబు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు చెబుతున్న నాగబాబు దంపతులు

ఏపీ గ్రీన్ కార్యనిర్వాహక కమిటీ ఛైర్మన్‌గా తనపై నమ్మకం ఉంచి ఈ కీలకమైన బాధ్యతలను అప్పగించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు , ఉప ముఖ్యమంత్రి, మా నాయకుడు పవన్ కళ్యాణ్ కు నాగబాబు కృతజ్ఞతలు. గ్రీనరీ, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనపై విశ్వాసం ఉంచి, ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్న ప్రతి నాయకుడికి, కార్యకర్తకు, అభిమానులకు నా ధన్యవాదాలు తెలిపారు. అందరి సహకారంతో అప్పగించిన ఈ బాధ్యతలను పూర్తి నిబద్ధతతో, చిత్తశుద్ధితో నిర్వహిస్తూ, గ్రీన్ ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి కృషి చేస్తానని నాగబాబు పేర్కొన్నారు.

ఏపీ గ్రీన్ కార్యనిర్వాహక కమిటీ ఛైర్మన్‌గా శ్రీ  కొణిదెల నాగబాబు బాధ్యతల స్వీకరణ

జనసేన పార్టీ శాసన మండలి సభ్యులు కొణిదెల నాగబాబు ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ గ్రీనింగ్ అండ్ రీఫారెస్టేషన్ ఫర్ ఎకలాజికల్ ఎన్‌రీచ్‌మెంట్ (ఏపీ గ్రీన్) సొసైటీ కార్యనిర్వాహక కమిటీ ఛైర్మన్‌గా శుక్రవారం అధికారిక బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరిలోని అరణ్యభవన్‌లో జరిగిన కార్యక్రమంలో నాగబాబు తన సతీమణి పద్మజ తో కలిసి పాల్గొన్నారు. వేదపండితుల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వేదపండితులు నాగబాబు కు వేద ఆశీర్వచనం అందించారు. ఆంధ్రప్రదేశ్ లో 2047 నాటికి భౌగోళిక విస్తీర్ణంలో అటవీ, వృక్ష విస్తీర్ణాన్ని 50 శాతానికి పెంచాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఏపీ గ్రీన్ కార్యక్రమంలో భాగంగా నాగబాబుకు ఈ కీలక బాధ్యతలు అప్పగించారు. ఏపీ గ్రీన్ సొసైటీ కార్యనిర్వాహక కమిటీ ఛైర్మన్‌గా ఆయనకు ప్రభుత్వం కేబినెట్ ర్యాంకు హోదా కల్పించింది. ఏపీ గ్రీన్ సొసైటీ కార్యనిర్వాహక కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన నాగబాబును పీసీసీఎఫ్ పి.వి.చలపతిరావు, అడిషనల్ పీసీసీఎఫ్ చీఫ్ రాహుల్ పాండే, అటవీశాఖ సలహాదారు మల్లికార్జునరావు, సీసీఎఫ్ వైల్డ్ లైఫ్ ఎన్. నాగేశ్వరరావు, సీసీఎఫ్ గుంటూరు వై. శ్రీనివాసరెడ్డి, పీసీసీఎఫ్ విజిలెన్స్ రేవతి, సీసీఎఫ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏపీ గ్రీన్ బి.ఎన్.ఎన్. మూర్తి , పంచాయతీరాజ్ కమిషనర్ శ్రీ కృష్ణతేజ, ఉప ముఖ్యమంత్రి ఓఎస్డీ వెంకటకృష్ణ, ఏపీ టిడ్కో ఛైర్మన్ వేములపాటి అజయ కుమార్, ఏపీఎంఎస్‌ఐడీసీ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాస్, తూర్పుకాపు సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్‌గా పాలవలస యశస్వి, పొల్యూషన్ కంట్రోట్ బోర్డు మెంబర్ పంచకర్ల సందీప్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.