Skip to main content

Telugu News Power

ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చే నెల,1 నర్సాపురం రాక. ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్, నాగరాణి, ఎమ్మెల్యే, నాయకర్.

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల పరిశీలనలో కలెక్టర్, ఎమ్మెల్యే.

నరసాపురం: ఆగస్టు, 28( తెలుగు న్యూస్ పవర్. కామ్) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చేనెల, 1న నర్సాపురం రానున్నారు. ఈ సందర్భంగా, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, బొమ్మిడి నాయకర్ ఇందుకు సంబంధించి ఏర్పాట్లపై క్షేత్రస్థాయిలో పర్యటించి, పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయటానికి ఎమ్మెల్యే, అధికారులకు పలు సూచనలు చేశారు. కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి రెవిన్యూ, పోలీసు, ఆర్ అండ్ బి, విద్యుత్ తదితర శాఖలు సమన్వయంతో పని చేయాలా సూచించారు. ముఖ్యమంత్రి పర్యటన సజావుగా సాగటానికి సమర్థవంతంగా పని చేయాలని కోరారు. ముఖ్యమంత్రికి స్వాగతం పలకటానికి హెలిపాడ్ వద్ద ఏర్పాట్లు, ముఖ్యమంత్రి రోడ్ షో, ప్రజా వేదిక, కార్యకర్తలు సమావేశం, పింఛను పంపిణీ కుటుంబం ఎంపిక సంబంధించి చర్చించారు. నరసాపురం వాలందరరేవు, సీతారాంపురం 27 వార్డు, మొగల్తూరు కుక్కల వారి తోట, పాత కాలువ ప్రదేశాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో, టిడిపి ఇన్చార్జ్, పొత్తూరు రామరాజు, జిల్లా ఎస్పీ నయీమ్ అస్మి, సంయుక్త కలెక్టర్ కల్పశ్రీ, అదనపు ఎస్పి డి విశ్వనాథ్, ఆర్టీవో దాసిరాజు, ఆర్ అండ్ బి, ఎస్ సి, అడబాల శ్రీనివాస్, కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు