Telugu News Power

కడియం పేపర్ మిల్ కార్మికులతో మంత్రి కందుల సమావేశం.

రాజమహేంద్రవరం, జూన్, 11 (తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మాత్యులు పందుల దుర్గేష్ గురువారం తన క్యాంపు కార్యాలయంలో కడియం పేపర్ మిల్లు కార్మిక సంఘాల ప్రతినిధులతో సమావేశమైయయ్యారు. ఈ సందర్భంగా, మిల్లులో నెలకొన్న పరిస్థితులు, ఉద్యోగులు మరియు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై విస్తృతంగా చర్చించారు. మిల్లు యాజమాన్యం తొలగించిన 59 మంది ఒప్పంద కార్మికులు, 11 మంది రెగ్యులర్ ఉద్యోగులు సహా మొత్తం 70 మందిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని యాజమాన్యాన్ని కోరారు. కార్మికుల కుటుంబాల జీవనోపాధి, వారి భవిష్యత్తు దృష్ట్యా ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యతతో పరిగణిస్తున్నామని తెలిపారు.
కార్మికుల హక్కులు, ఉపాధి భద్రత పరిరక్షణ విషయంలో కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ వారి పక్షాన నిలుస్తుందన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు మిల్లు యాజమాన్యంతో ఉన్నతస్థాయి చర్చలు నిర్వహించి, సానుకూల నిర్ణయం తీసుకునేలా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కార్మికులకు అన్యాయం జరగకుండా చూస్తామని సంఘ నాయకులకు హామీ ఇచ్చారు.