Skip to main content

Telugu News Power

కరుణ చూపిన కారుణ్య ట్రస్ట్, ఐఐటీ విద్యార్థికి ఆర్థిక సాయం.

యలమంచిలి:ఆగస్టు,7
(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక కారుణ్య ట్రస్ట్, వ్యవస్థాపకులు దొంగ నాగేశ్వరావు పాలకొల్లుకు చెందిన ఐఐటి విద్యార్థి, మండెల శ్రీరామ్ కు రూ. 50 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. మద్రాస్ ఐఐటీకి ఎంపికైన శ్రీరామ్ ఇంటర్న్ షిప్ కు వెళ్ళవలసి ఉంది. ఇందుకు అవసరమైన సొమ్ము కోసం తండ్రి వెంకట సుబ్బారావు పలువురు పాలకొల్లు ప్రముఖులను కలిశారు. అయితే ఎక్కడ వారికి ఒక్క రూపాయి కూడా సాయం సొమ్ము పుట్టలేదు. దీంతో ఈ కుటుంబం దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్లాడుతుంది. ఈ విషయం కారుణ్య ట్రస్ట్ దృష్టికి రావటంతో వ్యవస్థాపకులు దొంగ నాగేశ్వరరావు వారిని తన స్వగృహానికి పిలిపించుకుని శుక్రవారం ఆర్థిక సహాయం అందజేశారు. విద్యార్థి, అతని తండ్రి కేవలం రూ. 10వేల రూపాయలు దొరికితే చాలు అనుకున్నారు. అయితే నాగేశ్వరరావు పెద్ద మనసుతో ఏకంగా 50 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. దీంతో వారు, ట్రస్ట్ చైర్మన్ దొంగ నాగేశ్వరరావు ఔదార్యానికి ఆశ్చర్యపోయారు. ఈ సందర్భంగా, నాగేశ్వరరావుకు కృతజ్ఞతలు తెలిపారు. కారుణ్య ట్రస్ట్ ద్వారా మానవత్వంతో ఎంతో మందికి ఆర్థిక సహాయం చేసి ఆదుకుంటున్న నాగేశ్వరరావు ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. ట్రస్ట్ మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆకాంక్ష వ్యక్తం చేస్తున్నారు.