Skip to main content

Telugu News Power

కవిటంలో కిషోర్ బాలిక కార్యక్రమం.

కవిటంలో జరిగిన కిషోర్ బాలిక కార్యక్రమ దృశ్యం

పోడూరు: మే, 15 (తెలుగు న్యూస్ పవర్ .కాం.) బాలికలు తమ ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఉండాలని ఐ సి డి ఎస్ ప్రాజెక్ట్ సూపర్వైజర్ కే మోహనరాణి సూచించారు. కిషోర్ బాలిక వికాసం కార్యక్రమంలో భాగంగా బాలికలకు స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలలకు అవగాహన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. లైంగిక, పునరుత్పత్తి, ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమం బాలబాలికులకు విడివిడిగా కార్యక్రమం నిర్వహించారు. తల్లిపాల ద్వారా, రక్తమార్పిడి ద్వారా, సురక్షితం కానీ లైంగిక చర్యల వల్ల ఎయిడ్స్ వ్యాధి సంక్రమించవచ్చని వైద్య సిబ్బంది అవగాహన కల్పించారు. బాలల హక్కులు, ఫోక్సో చట్టం పై బుక్స్ చట్టంపై బాలలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తమకు ఎదురయ్యే వివిధ రకాల ఇబ్బందుల పట్ల అప్రమత్తస్తో ఉండాలని సూచించారు. చదువుపై శ్రద్ధతో, నైతిక విలువలు కలిగి తల్లిదండ్రుల పట్ల గౌరవంగా మెలగాలని కోరారు. ఈ కార్యక్రమంలో, పి మాతా శ్రీ, అంగన్వాడి,ఆశా కార్యకర్తలు, బాల బాలికలు పాల్గొన్నారు.