Telugu News Power

అపర భగీరధుడు సర్ ఆర్థర్ కాటన్ బాటలో మంత్రి నిమ్మల -వాటర్ డిస్టిబ్యూటరీ కమిటీ చైర్మన్ పెనుమత్స రాంభద్ర రాజు.

పాలకొల్లు: మే ,15 (తెలుగు న్యూస్ పవర్. కామ్) అపర భగీరధుడు సర్ ఆర్థర్ కాటన్ ఇంజనీరింగ్ నైపుణ్యంతో ఉభయగోదావరిజిల్లాలు ఆంధ్ర అన్నపూర్ణగా విరసిల్లుతున్నాయని పాలకొల్లు వాటర్ డిస్టిబ్యూటరీ కమిటీ చైర్మన్ పెనుమత్స రామ్ భద్ర రాజు పేర్కొన్నారు. బ్రిటిష్ ఇంజనీర్, గోదావరి జిల్లాల ప్రజల తాగునీటి కోసం, రైతులకు సాగునీటి కోసం ధవలేశ్వరం వద్ద నిర్మించిన ఆనకట్టకు సృష్టికర్త కాటన్ మహనీయుని 266వ జయంతి వేడుకలు స్థానిక నీటిపారుదల శాఖ కార్యాలయం వద్ద శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా, రాజు మాట్లాడుతూ, కాటన్ బాటలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గెలవనుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు కృషి చేస్తున్నారని తెలిపారు. రైతుల ఖాతాలకు 20వేల రూపాయలు జమ చేసి రైతుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. నియోజకవర్గంలో రైతుల కోసం పంట కాలువలు, కాలువలు పనులు చేపట్టి రైతులు అధిక దిగుబడి పొందటానికి కృషి చేస్తున్నారన్నారు. కాలువల వెంబడి రోడ్లు ఏర్పాటు చేసి రైతుల పొలాలకు బాటలు వేస్తున్నారన్నారు. డెల్టా ప్రాంతాల్లో ప్రతి ఎకరానికి నీరు అందించేందుకు కృషి జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు మాట్లాడుతూ, రైతులు సరార్ధర్ కాటన్ ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని కోరారు. బోలో చిన్న బాబు మాట్లాడుతూ ఈ ప్రాంత నాగరికత అభివృద్ధికి కాటన్ దొర సేవలు అందించారన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కోడి విజయభాస్కర్, టిడిపి రాష్ట్ర కార్యదర్శి, చిట్టి బాబు, పట్టణ కార్యదర్శి గండేటి వెంకటేశ్వర్రావు, బిజెపి నాయకులు ఉన్నమట్ల కపర్తి, జక్కంపూడి కుమార్, చిట్టూరి ఆంజనేయులు, మాతా రత్నం రాజు, ఆరమిల్లి రామ శ్రీనివాస్, దేవళ్ళ కోటి మోహన్, ఇంటి శ్రీరాముడు, సిడగం సురేంద్ర, వవిన్నకోట గోపి, పాముల రజిని కుమార్, బందెల భాస్కరరావు, నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, సిహెచ్ వెంకటనారాయణ, ఎస్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.