Skip to main content

Telugu News Power

స్త్రీ శక్తి పథకంలో ఇప్పటివరకు 70 కోట్లమంది ఉచిత ప్రయాణం. -మంత్రిని నిమ్మల బస్సు ప్రయాణం.

బస్సు ప్రయాణంలో చిన్నారుల మాటలతో మంత్రి చిరునవ్వులు
మంత్రి సమక్షంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలుపుతున్న చాంబర్స్ విద్యార్థులు

పాలకొల్లు: ఆగస్టు,15( తెలుగు న్యూస్ పవర్. కామ్) కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల్లో ప్రముఖమైన మహిళల ఉచిత ప్రయాణం ఇప్పటివరకు 70 కోట్ల మంది వినియోగించుకున్నట్టు, స్థానిక శాసనసభ్యులు, జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు, శనివారం శివదేవుని చిక్కాల లో ఆర్టీసీ బస్సు ఎక్కి, పాలకొల్లు వరకు ప్రయాణించారు. మహిళల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వారిని ఆర్థికంగా సామాజికంగా ప్రకృతి పదం లో నడిపించడానికి కూటం ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. మంత్రి బస్సులో ప్రయాణికులతో ముచ్చటించారు. స్త్రీ శక్తి పథకం ద్వారా వారికి అందుతున్న సౌకర్యాలు, మిగులుతున్న ఆదాయం, ఎదురవుతున్న సమస్యల గురించి ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నారు. బస్సులో బాలికలతో ఆప్యాయంగా మాట్లాడారు. పాలకొల్లు బస్ స్టేషన్ వద్ద మహిళా ప్రయాణికులు, వాడపల్లి వెంకన్న బాబు నిమ్మలమల్లి అధికారంలోకి రావాలని కోరుకున్నట్టు మంత్రి నిమ్మలకు తెలిపారు. దీంతో మంత్రి నిమ్మల ఆనందంతో ఉబ్బితబిబ్బయ్యారు. ఉచిత ప్రయాణం వల్ల అత్యవసర పరిస్థితుల్లో వైద్య సహాయం వంటి సేవలకు ఎంతో ఉపయోగకరంగా ఉందని మంత్రికి తెలిపారు. ఛాంబర్స్ విద్యార్థులు ఉచిత ప్రయాణం వల్ల తల్లిదండ్రులపై నెలవారి బస్సు పాసుకు చెల్లించే ఐదారు వందల రూపాయలు ఖర్చు ఆదాముతున్నట్టు మంత్రికి తెలిపారు. ఈ ప్రయాణంలో ప్రభుత్వానికి అనుకూలమైన ప్రజాస్పందన అర్థం కావటంతో మంత్రి సంతృప్తి చెందారు.

మళ్లీ మీరే మంత్రి కావాలని మొక్కుకున్నట్టు మహిళలు చెప్పడంతో సంతోషం వ్యక్తం చేస్తున్న నిమ్మల