Telugu News Power

విద్యార్థికి ఛాంబర్స్ కాలేజీ లో సన్మానం.

రిత్విక్ ను సత్కరిస్తున్న చైర్మన్ నరసింహారావు

పాలకొల్లు: జూలై, 22( తెలుగు న్యూస్ పవర్. కామ్ ) కళాశాల ఇంటర్మీడియట్ విద్యార్థి అలుగుసాని రిత్విక్, ఎం ఈ సీ గ్రూపులో అత్యుత్తమ ప్రతిభ కనబరచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షైనింగ్ స్టార్స్ ప్రతిభా పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా,రిత్విక్ ను ఛాంబర్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఛైర్మన్ కేవీర్ నరసింహారావు ఘనంగా సత్కరించి, అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రిత్విక్ తల్లిదండ్రులు పాల్గొని తమ కుమారుని తీర్చిదిద్ధిన అధ్యాపకులకు, యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు.
కళాశాల సెక్రటరీ,కరస్పాండెంట్ కేవీ సీతారామరాజు, ట్రెజరర్ ఆర్. ప్రవీణ్ భాను, అకడమిక్ అడ్వైజర్స్ డాక్టర్ మూర్తి, నందుల సీతారామారావు, వైస్ ప్రిన్సిపాల్, బి. విజయలక్ష్మి,, కళాశాల అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థిని ప్రశంసించారు.