పాలకొల్లు/ యలమంచిలి: జూలై,20( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు మానవీయ శ్రద్ధ, సేవల వల్ల ఓ బాలిక పునర్జన్మ ఎత్తింది. బాలిక నిండు నూరేళ్ల జీవితం మొగ్గలోనే రాలిపోకుండా, నిమ్మల అమృత హస్తాలు ఆదుకొని, ఆ కుటుంబంలో నెలకొన్న విషాద చీకట్లను తొలగించి, సంతోషాల వెలుగులు నింపింది. యలమంచిలి మండలం, కనకాయ లంకకు చెందిన బాలిక కొల్లు అనూష గుండెకు రంధ్రం ఉండటంతో జీవితం ప్రమాదంలో పడిందనే హృదయ విదారక విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, పాప కాపాడుకోవడం కోసం ఆ కుటుంబం మంత్రి నిమ్మలను ఆశ్రయించింది. మానవత్వానికి మారుపేరైన మంత్రి నిమ్మల వెంటనే స్పందించి బాలిక వైద్యానికి కావలసిన ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.2.20 లక్షలు మంజూరు చేయించారు. మంత్రి స్వయంగా ఆసుపత్రికి వెళ్లి వైద్యులతో మాట్లాడి బాలికకు కావలసిన వైద్య సహాయం సహకారాల అందించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. శస్త్ర చికిత్స విజయవంతమై బాలిక కోలుకుంది. ఈ సందర్భంగా మంత్రి నిమ్మలను బాలికతో కలిసి ఆ కుటుంబం కృతజ్ఞతలు తెలియజేసింది. మంత్రి ఈ సందర్భంగా బాలిక ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని,భరోసా ఇచ్చారు.
చిన్నారికి పునర్జన్మనిచ్చిన సీఎం సహాయనిధి. -మంత్రి నిమ్మల వ్యక్తిగత శ్రద్ధ
మంత్రి నిమ్మల అనూష ఆరోగ్య పరిస్థితి గురించి ఆసుపత్రిలో ఆరా తీస్తున్న నాటి దృశ్యం