Telugu News Power

దస్తావేజులేఖర్ల పెన్ డౌన్ నిరసన ప్రారంభం.

నిరసన శిబిరంలో నినాదాలు చేస్తున్న దస్తావేజులేఖర్లు

పాలకొల్లు: జూలై,20( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక సబ్-రిజిస్టార్ కార్యాలయం వద్ద సోమవారం దస్తావేజు లేఖర్ల పెన్ డౌన్ నిరసన కార్యక్రమం శిబిరాన్ని సంఘ అధ్యక్షులు తాళ్లూరు వెంకటేశ్వరరావు ప్రారంభించారు. వేలాదిమంది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న ప్రస్తుత వ్యవస్థకు గొడ్డలిపెట్టుగా, లేకర్ల పొట్ట పొట్టే విధంగా ప్రభుత్వం తీసుకు వస్తున్న 396 జీవో వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. లేఖర్లతో పాటు డిటిపి ఆపరేటర్లు, పరోక్షంగా ఇంకా ఎందరో ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రైవేటీకరణ చేయడం వల్ల వీరు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విధానం వల్ల ప్రజల ఆస్తుల భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించారు. దస్తావేజు లేఖర్లకు లైసెన్సులు పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లకు స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని తెలిపారు. రిజిస్టర్ ఆఫీస్ వద్ద ఏ కార్యక్రమాలు జరగకుండా వారు సోమవారం నిరోధించారు. సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్ కు తమ డిమాండ్ల కూడిన వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు తమ డిమాండ్ల కోసం నినాదాలు చేశారు. సంఘ కార్యదర్శి, కడలి శ్రీనివాస్, కపిల వెంకటకృష్ణ, గోటేటి హనుమంతరావు, దేవుళ్ళ శివరామకృష్ణ, ఆచంట సత్యనారాయణ మూర్తి, కోశాధికారి, కొల్లేపర్ర అమ్మిరాజు, కృత్తివెంటి రవికాంత్ దంపతులు, స్టాంపు వండర్లు సుమారు 150 మంది వరకు ఈ నిరసన కార్యక్రమంలో తొలి రోజు పాల్గొన్నారు.