Skip to main content

Telugu News Power

ఛాంబర్స్ కళాశాలలో తెలుగు వ్యవహారిక భాషా దినోత్సవం.

భాష దినోత్సవ సందర్భంగా చిలకమర్తి శాస్త్రి ని సత్కరిస్తున్న చాంబర్స్ యాజమాన్యం

పాలకొల్లు: ఆగస్టు,29( తెలుగు న్యూస్ పవర్. కామ్)
స్థానిక ఛాంబర్స్ డిగ్రీ, పిజీ కళాశాల ప్రాంగణంలో శనివారం గిడుగు వెంకట రామమూర్తి జయంతి, తెలుగు భాషా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భాషా ప్రవీణ, గ్రేడ్ – I పండితులు, చిలకమర్తి సుబ్రహ్మణ్య శాస్త్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ,తెలుగు భాష కమ్మదనం, చక్కదనం తో కూడిన ఆవుపాలు లాంటిదన్నారు. ఈ భాషను ఆస్వాదించడం తెలుగువారి అదృష్టం అన్నారు. ఇష్టపడ్డప్పుడు ఏ విషయలోనైనా జ్ఞాన సముపార్జన సులభం అవుతుందన్నారు, ప్రతి విద్యార్థి తెలుగు పద్య పఠనం, తెలుగు కవితలు, తెలుగు సాహిత్యం పై అవగాహన పెంపొందించుకోవాలన్నారు. ధారణ,అభ్యసన ద్వారా ఈ నైపుణ్యాలు సాధించవచ్చునన్నారు. నన్నయ, తిక్కన, ఎర్రాప్రగడ, శ్రీ శ్రీ, లాంటి ఎందరో సాహితీ దిగ్గజాల గురించి విపులంగా, ఆసక్తికరంగా వివరించారు. అష్టావధానం, శతవదానం, సహస్రవదానం లాంటి విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు..
కళాశాల చైర్మన్ కెవి నరసింహారావు మాట్లాడుతూ, అంతరించబోవు భాషల్లో యుఎన్ఓ ప్రకటించిన భాషల్లో తెలుగు భాష ఉండటం అత్యంత బాధాకరమని, వృత్తిరీత్యా ఆంగ్ల భాష పై మక్కువ నేటి తరం వారికి ఉన్నప్పటికీ, అమ్మలాంటి మాతృభాష తెలుగును, తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను నేటి తరముకు అందించుటకు తమ కళాశాల తెలుగు డిపార్ట్మెంట్ చేస్తున్న కృషిని అభినందించారు.
కళాశాల సెక్రటరీ,కె వి. సీతారామరాజు మాట్లాడుతూ, తెలుగు భాష గ్రాంథిక భాషలో ఉన్న కఠినత్వాన్ని అందరికీ అణువుగా వ్యవహారిక భాషగా అందించుటకు కృషి చేసిన శ్రీ గిడుగు వెంకట రామమూర్తి జన్మదినంను ప్రభుత్వం తెలుగు భాషా దినోత్సవం గా ప్రతి సంవత్సరం ఆగస్టు 29న జరుపుకొనుటకు అవకాశం కలిగించినదని, మన మాతృభాష తెలుగును అతి ప్రాచీన భారతీయ భాషగా కేంద్రం గుర్తించుట మన తెలుగు జాతికి గర్వ కారణం అన్నారు.

కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి. వెంకటేశ్వర రావు మాట్లాడుతూ, దేశభాషలందు తెలుగు భాష లెస్స అని కృష్ణదేవరాయలు మాటలను నేడు తెలుగువారమైన మనందరం గుర్తించాలన్నారు. ప్రపంచ దేశాలలో మన తెలుగువారు ఎక్కడున్నా భాష మూలాలను మరవకుండా భాషాభివృద్ధి చేస్తున్నారని వెల్లడించారు.తమ కళాశాల విద్యార్థులకు క్యాలెండర్లో ప్రముఖ రోజులను ఈ విధంగా నిర్వహించుకొనుట వల్ల బహుముఖ ప్రజ్ఞా వంతులుగా తయారై దేశానికి అత్యుత్తమ పౌరులుగా తీర్చిదిద్దుటకు దోహదపడుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులు తెలుగు కవితలు, తెలుగు గీతాలపన చేసి విద్యార్థులందరినీ అలరించారు.ముఖ్య అతిథి చిలకమర్తి సుబ్రహ్మణ్య శాస్త్రిని కళాశాల యాజమాన్యం ఘనంగా సత్కరించినారు.
ఈ కార్యక్రమంలో కళాశాల అకాడమిక్ అడ్వైజర్స్ డాక్టర్ ఏబిఎస్ మూర్తి , నందుల సీతారామరావు, తెలుగు అధ్యాపకులు, నరసమాంబ జూనియర్ కళాశాల తెలుగు అధ్యాపకులు లింగరాజు విద్యార్థులు పాల్గొన్నారు.