Skip to main content

Telugu News Power

తెలుగుకు గొడుగు, వ్యవహారిక భాషా పితామహుడు ‘గిడిగు’

తెలుగు వ్యవహారిక భాషా పితామహుడు గిడుగుకు నివాళి.
వక్త శ్రీనివాస్ ను సత్కరిస్తున్న దృశ్యం.

విద్యాశాఖ, రసధుని ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలు.

పాలకొల్లు:ఆగష్టు, 29(తెలుగు న్యూస్ పవర్.కామ్)
తెలుగుభాషా దినోత్సవం సందర్బంగా, స్థానిక బి. ఆర్. ఎమ్. వి. ఉన్నత పాఠశాల వారి సహకారంతో, ప్రఖ్యాత సాహితీ సంస్థ,రసధుని, మండల విద్యాశాఖ సంయుక్త ఆధ్యర్యంలో, తెలుగు వ్యవహారిక భాషా పితామహుడు, గిడుగు వెంకట రామూర్తి పంతులు జయంతి ఉత్సవాలు శనివారం ఘనంగా జరిగాయి. గిడుగు జయంతి సందర్బంగా,మున్సిపల్, ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులకు, సీనియర్ విభాగంలో 8,9 తరగతులకు “తెలుగుభాషా మాధుర్యం”, జూనియర్ విభాగంలో 6,7 తరగతులకు “పోతన, వేమన, దేవరకొండ బాలగంగాధర
తిలక్” కవిత్వ అంశాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి, ముఖ్యఅథిధి మండల విద్యాశాఖాధికారి ఎన్.వి.ఎస్. గంగాధరశర్మ విజేతలకు బహుమతులు అందజేసారు.
ఈ సభకు రసధుని ప్రధాన కార్యదర్శి యర్రంశెట్టి వెంకటరత్నం స్వాగతం పలికారు. కొట్టి భాస్కరరావు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిధులుగా
స్థానిక ఉన్నతపాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎమ్.శివలీల,
బిసి వెల్ఫేర్ స్కూల్ ప్రిన్సిపాల్
జి. సూర్యకుమారి హాజరయ్యారు. ముఖ్యవక్త, విశిష్ట కవి, రచయిత మామిడిశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ, తెలుగుభాష కేవలం మనం మాట్లాడుకునే భాష మాత్రమే కాదన్నారు. మనసంస్కృతి,సాంప్రదాయం,
చరిత్ర, భావోద్వేగాలకు ప్రతిరూపమన్నారు.
తెలుగుభాషను పండితుల గ్రాంధిక భాషనుండి సామాన్యులకుఅర్ధమయ్యే వ్యవహారికభాషవైపుతీసుకురావడానికి
గిడుగువారు గొప్ప ఉధ్యమంచేసి సఫలికృతులయ్యారన్నారు. తెలుగు భాష ఇంత తియ్యగా, సుందరంగా, వినసొంపుగా ఉంటుందన్నారు. నన్నయ్య, తిక్కన, యర్రాప్రగడ వంటి మహాకవులు,శ్రీనాధుడు,
పోతన,అన్నమయ్య,వేమన,శ్రీకృష్ణదేవరాయలు,గుఱజాడ,
శ్రీశ్రీ వంటిమహనీయులను తెలుగుభాష అక్కున చేర్చుకుందని పేర్కొన్నారు.
వేదికను అలంకరించిన వి.వి.ఎస్.ఎన్. రాజు, కోలాటి పెద్దిరాజు, జక్కుల నాగేశ్వరరావు,పాఠశాలతెలుగుఉపాధ్యాయులు అనిశెట్టి వెంకటేశ్వరరావు, గిడుగు శ్రీనివాసరావు, అథిధులను, ముఖ్యవక్తను ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమం లో,
కలిదిండి వెంకటపతి వర్మ,
గుత్తుల ఎస్ ఎన్ మూర్తి, భట్టిప్రోలు సత్యనారాయణ,
వామనమూర్తి, ఉపాధ్యాయులు నిర్మలా రాణి, దక్షిణమూర్తి, రోజా, శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.