పాలకొల్లు:ఆగస్టు,14( తెలుగు న్యూస్ పవర్. కామ్)స్థానిక ఛాంబర్స్ కళాశాలల ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశానుసారం శుక్రవారం పురవీధులలో ఘనంగా “హర్ ఘర్ క తిరంగా” భారీ ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా చాంబర్స్ కళాశాల యాజమాన్యం ఆధ్వర్యంలో పాలకొల్లు పురవీధులలో ఉన్న ప్రతి షాపుకు జెండాలు ఉచితంగా 400 పంచారు. భారతమాతకి జై నినాదాలతో జాతీయ స్ఫూర్తిని నింపుతూ ఈ భారీ ర్యాలీ సాగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కళాశాల చైర్మన్ శ్రీ కెవిఆర్ నరసింహారావు గారు చేతుల మీదుగా ఈ ర్యాలీనీ గాంధీ బొమ్మల సెంటర్ నుంచి ప్రారంభించినారు
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఎంతోమంది స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలితం మనకు స్వాతంత్రం సిద్ధించినదని ఆ స్వతంత్ర స్ఫూర్తిని భారత దేశంలో ప్రతి పౌరుడు స్పూర్తిగా తీసుకుని ఉజ్వలమైన భారతదేశ అభివృద్ధికి కృషి చేయాలని, ప్రతి విద్యార్థి జాతి సమగ్రత, సమైక్యతను పెంపొందించుకుని దేశ శాస్త్ర, సాంకేతిక, సామాజిక, రాజకీయ, ఆర్థిక పురోభివృద్ధిలో కీలకపాత్ర పోషించాలన్నారు.
ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ కేవీ సీతారామరాజు, ట్రెజరర్ ఆర్ ప్రవీణ్ భాను, అకాడమిక్ అడ్వైజర్స్ ఏబీఎస్ మూర్తి, నందుల సీతారామ రావు, గవర్నింగ్ బాడీ మెంబర్స్ జయప్రకాష్, వర్మ , కళాశాలల ప్రిన్సిపాల్ డాక్టర్ డి. వెంకటేశ్వరావు, ఎన్సిసి ఆఫీసర్ సంతోష్ ప్రసాద్, ఎన్ఎస్ఎస్ అధికారులు రాధా మాధవి,రాంబాబు, రజిని అధ్యాపకులు ఎన్.రవికుమార్, పూర్నేష్, రవికుమార్ మరియు ఎన్సీసీ క్యాడేట్స్, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఛాంబర్స్ విద్యార్థులచే “హర్ ఘర్ క తిరంగా” భారీ ర్యాలీ
ఛాంబర్స్ విద్యార్థుల హర్ ఘర్ తిరంగా ర్యాలీ