జనరల్ డెస్క్: జూలై, 18( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆ అమ్మాయి పోతున్నాడమ్మా మనిషి అంటాడు కవి అందేశ్రీ. ఇక్కడ మనిషి అంటే మనిషిలోని మానవత్వం కనుమరుగైపోతున్న పరిస్థితిని చూసి ఆవేదనతో రాసిన పాట అది. భారతదేశంలో ప్రజలు స్వతహాగా ఆత్మ అభిమానంతో ఉంటారు. అది వారి మూల నుంచి వచ్చిన వారసత్వ సంపద. బిచ్చగాడు లేని దేశంగా భారతదేశాన్ని విదేశీయులు కొయ్యాడిన పరిస్థితి. అయితే నేటి ఆధునిక పరిస్థితుల్లో, తాహతుకు మించి చేసే తప్పుల వల్ల కుటుంబాలు ఆత్మహత్యలు పాలవుతున్నాయి. వ్యాపారం, వ్యవసాయం, ప్రేమ వ్యవహారాలు, రాజకీయాలు, విద్యా వ్యవస్థ, మాఫియా ముఠాల కారణంగా వేధింపులు తాళలేక తను చాలిస్తున్న సందర్భాలను భారతదేశంలో తరచూ చూస్తూ ఉంటాం. అభివృద్ధి చెందిన ఐదు దేశాల్లో ఒకటిగా ఉన్న జపాన్ లో కూడా ఈ పరిస్థితులు ఉండటం ఆశ్చర్యం కలిగించక మానదు. మూడవ తరగతి నుంచి జపాన్లో పిల్లలు అక్కడ చదువు లేక ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి ఉందని నివేదికలు ఘోషిస్తున్నాయి. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో అమెరికా 1945లో లిటిల్ బాయ్ అనే అణుబాంబు, హిరోషిమా, నాగసాకి నగరాలపై ప్రయోగించి కోలుకోలేని దెబ్బతీసింది. ఈరోజు కూడా నా ప్రభావం కొనసాగుతున్నది. మరో పక్క భూకంపాలు అన్నిటినీ తట్టుకునే ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది జపాన్. అయితే అంతా అక్కడ బాగుందని అనుకోవటం కూడా సహజం. కానీ ఈ ప్రపంచ యుద్ధం దగ్గరనుంచి
జపాన్‌లో వింత సంస్కృతి మొదలైందని చెబుతారు. జొహత్సు జపాన్ లో కనిపించి ఓ సాధారణ ప్రక్రియ. అదే మనుషులు ‘ఆవిరి’ అయిపోయే ‘జొహత్సు’. జపాన్ భాషలో జొహత్సు అంటే ఆవిరైపోవడం. ఏదైనా ధర్వాన్ని మరగపెట్టినప్పుడు అది ఆవిరిగా మారిపోయి అసలు ద్రవం కనపడకుండా పోతుంది. తెలుగులో మాయం అయ్యింది అంటాం, హిందీలో గాయబ్, ఆంగ్లంలో గాన్ అంటాం. ఈ జొహత్సు వెనుక ఎన్నో కన్నీటి గాథలు,
కథలు ఉన్నాయి.
ఈ విశాలమైన ప్రపంచంలో ఎవరికైనా కష్టాలు వస్తే ఏం చేస్తారు? స్నేహితులతో చెప్పుకుంటారు, కుటుంబ సభ్యుల సాయం కోరతారు లేదా కాస్త ధైర్యం తెచ్చుకుని ఆ సమస్యను ఎదుర్కొంటారు. కానీ జపాన్‌లో మాత్రం ఒక వింత అలవాటు ఉంది. అక్కడ మనుషులు సమస్యలు వస్తే, రాత్రికి రాత్రే మాయమైపోతారు! అవును, మీరు విన్నది నిజమే. ఎలాంటి ఆనవాళ్లు లేకుండా, తమ పాత జీవితాన్ని, బంధువులను వదిలేసి గాల్లో కలిసిపోతారు. జపనీస్ భాషలో ఈ వింత పద్ధతినే ‘జొహత్సు’ అంటారు.
ఇలా ప్రతి ఏటా జపాన్‌లో వేలాది మంది ప్రజలు తమ పాత జీవితాలను వదిలేసి మాయమైపోతున్నారు.ఈ సంస్కృతిని అవగాహన చేసుకోవడానికి,దీని వెనుక ఉన్న, గుండెలు పిండేసే ఒక యదార్థ గాథ గురించి తెలుసుకుందాం. ఇది
కోయిచి అనే ఇంజనీర్ కథ. ఒక ఉదయాని కే మారిన జీవితం,
జపాన్‌లోని టోక్యో నగరంలో కోయిచి అనే ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉండేవాడు. సమాజంలో మంచి గౌరవం, ఇంట్లో ప్రేమించే భార్య, పిల్లలు. అంతా సవ్యంగా సాగుతోందనుకున్న సమయంలో ఆ కంపెనీలో వచ్చిన ఆర్థిక సంక్షోభం వల్ల కోయిచి ఉద్యోగం పోయింది.
జపాన్ సంస్కృతిలో ఉద్యోగం పోవడం, అప్పులపాలు కావడం అనేది అత్యంత అవమానకరమైన విషయంగా భావిస్తారు. సమాజం ఏమనుకుంటుందో, భార్యాపిల్లల ముందు తలెత్తుకోలేనేమో అన్న తీవ్రమైన ఆత్మన్యూనత, అవమాన భారం కోయిచిని వేధించింది. రోజూ ఉదయం ఆఫీస్‌కు వెళ్తున్నట్లే కోటు, సూటు వేసుకుని ఇంటి నుంచి బయలుదేరేవాడు. రోజంతా పార్కుల్లోనూ, రైల్వే స్టేషన్లలోనూ ఖాళీగా కూర్చుని, రాత్రికి అలసిపోయినట్లు ఇంటికి వచ్చేవాడు. కానీ, లోలోపల అప్పులు పెరుగుతున్నాయి, నిజం చెప్పే ధైర్యం సరిపోవడం లేదు.
ఒకరోజు కోయిచికి ఇక ఈ జీవితం వద్దు అనుకున్నాడు. చనిపోవడానికి మనసు ఒప్పలేదు. అందుకే ‘జొహత్సు’ మార్గాన్ని ఎంచుకున్నాడు. మనం ఇల్లు మారినప్పుడు వాడే ప్యాకర్స్ అండ్ మూవర్స్ లా,జపాన్లో
’నైట్ మూవర్స్’ (రాత్రి తరలించేవారు) సాయంతో రాత్రికి రాత్రే కోరుకున్న వ్యక్తులను మాయం చేసేస్తారు.
జపాన్‌లో ఇలా మనుషులను రాత్రికి రాత్రే మాయం చేయడానికి ప్రత్యేకమైన ఏజెన్సీలు ఉన్నాయి. వీటిని ‘యోనిగే-యా’ కంపెనీలు అంటారు. కోయిచి అలాంటి ఒక ఏజెన్సీని సంప్రదించాడు.
ఒకరోజు అర్ధరాత్రి భార్యాపిల్లలు గాఢ నిద్రలో ఉన్న సమయంలో,ఆ ఏజెన్సీ వారు నిశ్శబ్దంగా కోయిచి ఇంటికి వచ్చారు. ఇలా చేయటానికి జపాన్ చట్టాల ప్రకారం అనుమతి కూడా ఉంది అతనికి కావలసిన కొన్ని బట్టలు, ముఖ్యమైన పత్రాలు మాత్రమే సర్దుకుని, ఎలాంటి శబ్దం కాకుండా ఒక నల్లటి వ్యాన్‌లో కోయిచిని అక్కడి నుంచి తరలించారు. తెల్లారేసరికి కోయిచి ఆ నగరంలో లేడు. ఫోన్ నంబర్ మార్చేశాడు, సోషల్ మీడియా ఖాతాలు డిలీట్ చేసేశాడు. అతను వేరే నగరానికి వెళ్లి, తన పేరు మార్చుకుని ఒక చిన్న హోటల్లో క్లీనర్‌గా చేరి కొత్త జీవితాన్ని ప్రారంభించాడు.
ఉదయం లేచి చూసిన భార్యకు ఇల్లు ఖాళీగా కనిపించింది. భర్త మాయమయ్యాడని తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ జపాన్ చట్టాల ప్రకారం… ఒక వ్యక్తి తన ఇష్టపూర్వకంగా ఇల్లు వదిలి వెళ్తే, అది నేరం కాదు. పైగా అక్కడ ప్రైవసీ (వ్యక్తిగత గోప్యత) చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. అందువల్ల పోలీసులు కూడా వారిని వెతకడానికి పెద్దగా ఆసక్తి చూపరు. అలా కోయిచి తన కుటుంబానికి శాశ్వతంగా ‘ఆవిరి’ అయిపోయాడు.
ఎందుకు ఈ జొహత్సు?
జపాన్ ప్రజలు జొహత్సు అవ్వడానికి ప్రధాన కారణాలు:
తీవ్రమైన పని ఒత్తిడి లేదా వైఫల్యం: ఆఫీసుల్లో విపరీతమైన ఒత్తిడిని తట్టుకోలేకపోవడం, వ్యాపారంలో నష్టపోవడం.
పరీక్షల్లో ఫెయిల్ అవ్వడం: పెద్ద కాలేజీల్లో సీటు రాకపోవడం, సమాజానికి ముఖం చూపించలేక కొందరు విద్యార్థులు కూడా ఇలా మాయమవుతారు.
కుటుంబ సమస్యలు,
అప్పులు: గృహ హింస నుండి తప్పించుకోవడానికి లేదా లోన్ షార్క్స్ (వడ్డీ వ్యాపారుల) వేధింపుల నుంచి తప్పించుకోవడానికి, తప్పని ఓ అనివార్య విషాద ఘట్టం.
ఒక చేదు నిజం ఏంటంటే, జపాన్‌లో ప్రతి ఏటా దాదాపు 80 వేల నుంచి ఒక లక్ష మంది వరకు ఇలా జొహత్సు అవుతున్నట్లు అంచనా.
తమ వారు బ్రతికే ఉన్నారో లేదో తెలియక, కనీసం చావు వార్త కూడా వినపడక ఏళ్ల తరబడి కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూసే కుటుంబాల బాధ వర్ణనాతీతం. జపాన్ సాధించిన ఆధునిక సాంకేతిక ప్రగతి వెనుక ఉన్న ఒక చీకటి కోణమే ఈ ‘జొహత్సు’ సంస్కృతి. నా అన్నవాళ్ళు లేని ఓ నరకం ఈ జొహత్సు చిరునామా ఈ సంస్కృతి. జపాన్ దేశానికి సంబంధించిన విషయం. మన దేశంలో అయితే లక్షల కోట్లు కొట్టేసిన, ఏ అవమాన భారం మోయనక్కర లేకుండా, పేద ప్రజల నుంచి దోచుకొన్న సొమ్ముతో చక్కగా విదేశాలకు చిక్కేసి, చక్కని చుక్కలతో, బీచుల్లో తిరుగుతూ బహిరంగంగా అనుభవించు రాజా అన్నట్టు తిరగవచ్చు. మన దేశం వారి మీద ఈగ కూడా వాళ్ళనివ్వదు. ఇక వారికి సిగ్గు లజ్జ ఉండవలసిన అవసరం ఏముంది ఇదేమీ జపాన్ కాదు కదా.
జపాన్ లో ‘ఆవిరైపోతున్న’మనిషి
జపాన్ లో ఆవిరైపోతానన్న మనిషికి సిద్ధంగా ఉంచిన వాహనం.