Telugu News Power

సుకుమార్ కు జాతీయ అవార్డు. ఉత్తమ స్క్రీన్ ప్లే, పుష్ప-2

న్యూఢిల్లీ: జూలై, 18( తెలుగు న్యూస్ పవర్. కామ్) పాన్ ఇండియా చిత్రాల దర్శకుడు, సంచల రికార్డులు సృష్టించే కోనసీమ కుర్రాడు, చిత్ర విజయానికి అవసరమైన లెక్కలు పక్కాగా చూసుకునే దర్శక దిగ్గజం సుకుమార్ కు
“పుష్ప 2” చిత్రానికి గాను జాతీయ ఉత్తమ స్క్రీన్‌ప్లే అవార్డు తెచ్చి పెట్టింది.
తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని జాతీయ స్థాయిలో మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లిన ప్రతిభకు పలువురు అభినందనలు తెలిపారు. సృజనాత్మక ప్రయాణం విజయపథంలో కొనసాగుతూ, భవిష్యత్తులో మరెన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను అందుకోవాలని అభిలాషించారు. హీరో అల్లు అర్జున్, చిత్ర బృందం, చలన చిత్ర ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు.