Telugu News Power

టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎల్. సాయి శ్రీనివాస్ ను ప్రకటించిన రాష్ట్ర కౌన్సిల్

ఎమ్మెల్సీ అభ్యర్థి సాయి శ్రీనివాస్

అమరావతి: జూన్, 28( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా లంకలపల్లి సాయి శ్రీనివాస్ ను రాష్ట్ర కౌన్సిల్ ఆదివారం ప్రకటించింది. పోటీ చేయడానికి కలిసివచ్చే ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాల మద్దతుతో ప్రస్తుత స్టేట్ టీచర్స్ యూనియన్(ఎస్ టి యు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఫ్యాప్టో చైర్మన్ గా లంకలపల్లి సాయి శ్రీనివాస్ పదవులు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర కౌన్సిల్ తీర్మానం మేరకు సాయి శ్రీనివాస్ అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించారు.లంకలపల్లి సాయి శ్రీనివాస్ 18 సంవత్సరాలు పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా, గత ఆరు సంవత్సరాలుగా ఎస్ టి యు రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా ప్రస్తుతం ఫ్యాప్టో చైర్మన్ గా 24 సంవత్సరాలుగా ఉపాధ్యాయ ఉద్యమంలో అనేక పోరాటాలలో పాల్గొన్నారు. ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి ఉపాధ్యాయ సంఘాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయటానికి ఈరోజు అధ్యక్షులు మల్లు రఘునాథరెడ్డి, ఎస్టీయూ రాష్ట్ర కమిటీ అధికారికంగా ప్రకటించి, సాయి శ్రీనివాస్ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.