Telugu News Power

పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా కాపు సంఘాల సమావేశం.

సమావేశానికి హాజరైన కాపు నాయకులు


విజయవాడ: జూన్, 28( తెలుగు న్యూస్ పవర్. కామ్) కాపు చైతన్య రథం పేరిట రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ కు మద్దతుగా కాపు నాయకులు ఆదివారం అమరావతి ఫంక్షన్ హాల్ లో సమావేశం నిర్వహించారు.గత కొన్ని రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాపు సమాజంలో చీలిక తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పలువురు కాపు సంఘాల నాయకులు అభిప్రాయపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రికి అండగా నిలవాలని కాపు యువత, కుల సంఘాల నాయకులు స్వచ్ఛందంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన కాపు సంఘాల నాయకులు, యువత, మహిళలు పాల్గొని జనసేన పార్టీకి తమ మద్దతును ప్రకటించారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్‌కు అండగా నిలవాలని, స్వార్థ ప్రయోజనాల కోసం సమాజంలో విభేదాలు సృష్టించే ప్రయత్నాలను ఐక్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ నాయకులు కలవకొలను తాతాజీ, సలాది రామకృష్ణ కూనా సూర్య ప్రకాష్, పెద్దిరెడ్డి శివ కిషోర్, పి వేంకటేశ్వరావు, (బాబు )హాజరయ్యారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన కాపు సంఘాల నాయకులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.