పాలకొల్లు: జూలై,16( తెలుగు న్యూస్ పవర్. కామ్)
స్థానిక బి ఆర్ఆర్ అండ్ జికేఆర్ ఛాంబర్స్ డిగ్రీ, పీజీ కళాశాలలో గురువారం డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులకు హానర్స్ డిగ్రీ కోర్సులపై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రిటైర్డ్ ప్రిన్సిపల్, ఎం వి ఎన్, జే ఎస్ అండ్ ఆర్ వి ఆర్ డిగ్రీ కళాశాల, మలికిపురం, పొన్నపల్లి శ్రీరామారావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వీరు
విద్యార్థుల నిర్దేశించి మాట్లాడుతూ, తమ లక్ష్యసాధనకు అంకుటిత దీక్షతో, ఆధునిక సాంకేతికతతో, చురుకుదనంతో, తెలివిగా సృజనాత్మకంగా ఉద్యోగాన్వేషణ మెలుకువలతో, నిత్య గ్రంధ పఠనం తోను, విద్యార్థి విద్యతోపాటుగా విలువలతో మెలగాలని సూచించారు. నేటి ప్రపంచంలో పోటీ తత్వంతో మెలగవలెనని అప్పుడు మాత్రమే విద్యార్థి తమ లక్ష్యాలను సాధించగలరని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, భారతదేశ అభివృద్ధిలో విద్య ఆవశ్యకతను గుర్తించిన భారత ప్రభుత్వం, నూతన విద్యా విధానం 2020లో పెను మార్పులు తీసుకువచ్చారన్నారు. ప్రపంచ సాంకేతిక విప్లవానికి అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, క్వాంటం టెక్నాలజీ, బిసిఎ లాంటి అత్యాధునిక కోర్సులు డిగ్రీలు ప్రవేశపెట్టడం వాటిని తమ కళాశాలలో నిర్వహిస్తున్నామన్నారు. ఇందువల్ల విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు.
ఈ కార్యక్రమానికి కళాశాల అడిషనల్ చైర్మన్ తట్టవర్తి కృష్ణమూర్తి , సెక్రటరీ కేవీ సీతారామరాజు, ట్రెజరర్ ఆర్ ప్రవీణ్ భాను, అకాడమిక్ అడ్వైజర్స్ డాక్టర్ ఏబిఎస్ మూర్తి, నందుల సీతారామ రావు, అధ్యాపకులు ఎన్విఆర్ రవికుమార్, మహంకాళి రావు టి. రాధా మాధవి, విజయలక్ష్మి, జానకిరామయ్య, లింగరాజు, నరసమాంబ, రంజని,లక్ష్మీ ప్రసన్న, ప్రసన్న నాగదేవి మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
డిగ్రీ విద్యార్థులకు ఆనర్స్ డిగ్రీ కోర్సులపై అవగాహన సదస్సు.
అవగాహన సదస్సులో మాట్లాడుతున్న పొన్నపల్లి