యలమంచిలి: జులై, 16( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక అబ్బిరాజుపాలెం సోంపల్లి మధ్య గోదావరి నదిపై పై ఫంటు నడుపుకోవడానికి నిర్వహించ తలపెట్టిన వేలం పాట ప్రక్రియ గురువారం మరోసారి బెడిసికొట్టింది. అధికారులు ముచ్చటగా మూడోసారి వేలంపాట వాయిదా వేయగలిగారు. ప్రభుత్వం నీవు పాటకు రూ. 13 లక్షలు అప్సర్డ్ ప్రైస్ గా నిర్ణయించింది. పాటదారులు రూ. 7.50,8.10,10 లక్షల వరకు చెల్లించటానికి మూడు జరిగిన రేవు పాట సందర్భాల్లో ఆసక్తి చూపించారు. మండల అభివృద్ధి అధికారి ( ఇంచార్జ్ )జె డి వి ప్రసాద్ గురువారం రూ.10 లక్షల ఆఫర్ ఇచ్చిన పాటదారుని కోసం రేవు పాట మరోసారి నిర్వహించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా సిండికేట్ల మధ్య గలాటా జరిగి యధావిధిగా రేవు పాటు వాయిదా పడింది. వివిధ రాజకీయ పార్టీలు సిండికేట్లుగా ఏర్పడ్డాయి. బయట పచ్చ గడ్డి వేస్తే బగ్గుమనే, నిత్యం కత్తులు దూసుకునే ప్రత్యర్థి పార్టీలు ప్రాణమిత్రులై రేవు పాట చావగ్గా కొట్టేయడానికి పడుతున్న పాట్లు చూసినవారు ముక్కున వేలేసుకుంటున్నారు. అధికారుల ప్రవర్తన పట్ల, ఏదో తేడా కొడుతుందని విమర్శలు చేస్తున్నారు.
సిండికేట్ల గలాటా తో, రేవు పాట వాయిదాల పర్వం.
రేపు పాట నిర్వహిస్తున్న పంచాయతీ కార్యాలయం వద్ద గలాట