Skip to main content

Telugu News Power

డ్వాక్రా మహిళలకు ఎగ్ కార్ట్ లు పంపిణీ చేసిన మంత్రి నిమ్మల.

పాలకొల్లు: మే, 5(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలమూరు శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు, మంగళవారం తన క్యాంపు కార్యాలయం వద్ద డ్వాక్రా మహిళలకు ఎగ్ కార్ట్ లు పంపిణీ చేశారు. జాతీయ గుడ్ల సమన్వయ కమిటీ (ఎన్ ఇ సి సి) వారి సౌజన్యంతో 50 వేల రూపాయల విలువైన, వ్యాపారానికి అవసరమైన బండి కుర్చీలు, ఇతర సమస్త సామాగ్రి ఉచితంగా అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మహిళల కోసం డ్వాక్రా పథకం తీసుకువచ్చారన్నారు. మహిళా సాధికారత కోసం కూటం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇలాంటి పథకాలు ఇంతవరకు మరెవరూ చేయలేదన్నారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. స్విచ్యురు పొలాలకు చెందిన వారికి లక్ష రూపాయల రుణంలో 50% సబ్సిడీతో రుణాలు మంజూరు చేశారు. పాలకొల్లు, యలమంచిలి, పోడూరు మండలాలకు చెందిన వారికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరింది. ఈ కార్యక్రమంలో, ఏఎంసీ చైర్మన్ కోడి విజయభాస్కర్, టిడిపి రాష్ట్ర కార్యదర్శి, పెచ్చెట్టి బాబు, పట్టణ అధ్యక్షులు గండేటి వెంకటేశ్వరరావు, గొట్టుముక్కల సూర్యనారాయణ రాజు, యర్రంశెట్టి పద్మారావు తదితరులు పాల్గొన్నారు.