కొండపి: అక్టోబర్,9( తెలుగు న్యూస్ పవర్. కామ్) రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో 34 శాతం రిజర్వేషన్లు బీసీలకు వర్తింప చేస్తామని శుక్రవారం కొండపి లో జరిగిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. వైసిపి పార్టీ ద్వారా బీసీలకు రిజర్వేషన్లు అమలు జరగకుండా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అడ్డుకున్నారని ముఖ్యమంత్రి ఆరోపించారు. న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని, పార్టీ పరంగా బీసీలకు 34 శాతం సీట్లు కేటాయిస్తామని వెల్లడించారు.
రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు.
సామాజిక వర్గం రిజర్వేషన్ శాతం
ఎస్సీ – మొత్తం 15%
ఎస్టీ – 6%
బీసీ-ఎ 7%
బీసీ-బి 10%
బీసీ-సి 1%
బీసీ-డి 7%
బీసీ-ఇ 4%
మొత్తం సామాజిక రిజర్వేషన్లు 50%
ఓపెన్ / అన్‌రిజర్వుడ్ కేటగిరీ 50 శాతంగా ఉంది.
తగ్గేదేలే, స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లు అమలు. -ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటన.
మంత్రి చంద్రబాబు నాయుడు.