Telugu News Power

తల్లిదండ్రులు ఉపాధ్యాయుల భారీ సమావేశం విజయవంతం చేయాలి – కలెక్టర్ నాగరాణి పిలుపు.

అధికారులతో సమావేశం నిర్వహిస్తున్న కలెక్టర్ నాగరాణి

భీమవరం: జూలై, 17
(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఈ నెల 24న జిల్లా వ్యాప్తంగా జరిగే మెగా పేరేంటి, టీచర్ సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కలెక్టరేట్లో వశిష్ట సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో పాటు గ్రామ పెద్దలు, దాతలు, పూర్వ విద్యార్థులు పాల్గొనేలా కృషి చేయాలని కోరారు. పాఠశాలకు అవసరమైన మౌలిక వసతుల కోసం దాతల నుంచి విరాళాలు సేకరించి ప్రయత్నం చేయాలని సూచించారు.