ఈనెల 20 నుంచి 31వరకు రిజిస్ట్రేషన్లు బంద్.పాలకొల్లు: జూలై, 17(తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రభుత్వం ఇచ్చిన జీవో నెం.396 ను వెంటనే ఉపసంహరించుకోవాలని పాలకొల్లు దస్తావేజు లేఖర్ల సంఘం అధ్యక్షులు టి వెంకటేశ్వర రావు విజ్ఞప్తి చేశారు. ఈనెల 20 నుంచి 31 వరకు పెన్ డౌన్ కార్యక్రమం చేపట్టినట్టనున్నట్టు శుక్రవారం తెలిపారు. ప్రభుత్వ జీవో వల్ల వేలాది కుటుంబాలు రోడ్డున పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. దస్తావేజు లేఖర్లు అందరూ ఈ పెండం కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఏ ఒక్కరూ క్రమశిక్షణ తప్పినప్పటికీ లేఖర్ల జీవితాలపై కోలుకోలేని దెబ్బ పడుతుందని హెచ్చరించారు. రిజిస్ట్రేషన్లు నిలిపివేయడం వల్ల ప్రభుత్వానికి వచ్చే కోట్లాది రూపాయల ఆదాయం నిలిచిపోతుందని, అందువల్ల తమ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం దిగి వస్తుందని దస్తావేజుల లేఖర్లు అభిప్రాయపడుతున్నారు.