Skip to main content

Telugu News Power

తిరుమల తిరుపతి దేవస్థానం అధికారా? నీ ఇల్లు బంగారం కాను.

తిరుపతి: సెప్టెంబర్, 2( తెలుగు న్యూస్ పవర్. కామ్) అవినీతిపరులైన తిరుమల తిరుపతి అధికారుల ఇళ్లపై ఏసీబీ కొరడా ఝలిపించింది. అవినీతి నిరోధక శాఖ అధికారులు, తిరుమల తిరుపతి దేవస్థానం డిప్యూటీఈవో లోకనాథం ఇంటిపై బుధవారం దాడులు నిర్వహించారు. ఈ దాడిలో ఏసీబీ అధికారులకు దిమ్మ తిరిగిపోయే అంత పని అయింది. లోకనాథం ఇల్లంతా వారికి కొత్తబంగారు లోకంలా కనిపించింది. బంగారు,వెండి ఆభరణాలు భారీగా స్వాధీనం చేసుకుంటున్నారు. లాకర్లలోను, బంధువు ఇళ్లలోనూ ఇంకెంతుందో చూడ వలసి ఉందని అధికారులు చెబుతున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు కేసు కు సంబంధించి జరిగిన ఈ దాడుల్లో అనేక ఆస్తులు పత్రాలు కూడా దొరికాయి. స్వామివారి సేవలో వాడే వెండి చెంబు కూడా ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. బంగారం బిస్కెట్లు, డాలర్లతో, బంగారం రాశులతో తులతూగుతున్న ఆ ఇల్లు సాక్షాత్తు కలియుగ వైకుంఠాధిపతి శ్రీ వెంకటేశ్వర స్వామి తన వివాహానికి తీసుకున్న అప్పు తీర్చి రమ్మని బంగారు రాశులు కుమ్మరించినట్టు ఉన్న దృశ్యాలు వెలుగులోకి వస్తున్నాయి. లోకనాథం బంధువుల ఇళ్లపై కూడా ఏకకాలంలో దాడులు జరిగాయి. ఈ సొత్తు, ఇతర ఆస్తుల విలువ కొన్ని కోట్ల వరకు ఉండవచ్చని ప్రాథమిక అంచనా వేస్తున్నారు.