
పాలకొల్లు:సెప్టెంబర్,2( తెలుగు న్యూస్ పవర్.కామ్) ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ పుట్టినరోజున, ఆయురారోగ్యాలతో ఉండాలని పంచారామ క్షేత్ర శిరోభాగ నిలయం శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో జనసేన నాయకులు, ధర్మకర్తలు పినిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో, బుధవారం రుద్రాభిషేకం, ప్రత్యేక అర్చనలు నిర్వహించారు ఈ సందర్భంగా, పురోహితులకు వస్త్ర దానం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జిల్లా కార్యదర్శి శ్రీ బోనం నర్సయ్య (చినబాబు), ఆలయ చైర్మన్ మీసాల రామచంద్ర రావు,ఏ ఎం సీ డైరెక్టర్ బిట్టా లక్ష్మీనారాయణ, ధర్మకర్త నీలాపు సింహాచలం, వీర మహిళలు, రియా, విష్ణు, జనసేన నాయకులు అన్నాబత్తుల ప్రసాద్, కండాపు శ్రీనివాసరావు,, ముత్యాలపల్లి మణికంఠ, జన సైనికులు, అబిమానులు పాల్గొన్నారు.