
దివ్యాంగుల జీవితాల్లో వెలుగుల కోసం రూ. 1.10 కోట్లు.
500 ఉపకరణాలు,365 మంది లబ్ధిదారులు.
చరిత్ర సృష్టించిన సంక్షేమ ఘట్టం.
పాలకొల్లు: అక్టోబర్, 13
(తెలుగు న్యూస్ పవర్. కామ్) దివ్యాంగులు దేవుని ప్రతిరూపాలని స్థానిక ఎంపీ, కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు రామానాయుడు పేర్కొన్నారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో దివ్యాంగుల సంక్షేమం కోసం రూ. 1.10 కోట్ల నిధులతో ఉపకరణాల పంపిణీ కార్యక్రమం మంగళవారం జరిగింది. సందర్భంగా, మంత్రులు మాట్లాడుతూ, దివ్యాంగులు స్వశక్తిపై ఆధారపడి, తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి, జీవితంలో పైకి రావడానికి,కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు. దివ్యాంగులకు అండగానిలవ లిసిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరి పైన ఉందన్నారు. నిమ్మల ధర్మారావు ఫౌండేషన్ ద్వారా 100 మంది వృద్ధులకు,100 మంది దివ్యాంగులకు మృతి కల్పిస్తున్నట్టు తెలిపారు. కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు 15 వేల రూపాయల వరకు పింఛను అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. నియోజకవర్గ దివ్యంగులకు భారీ మొత్తంలో నిధులు మంజూరు చేయించి, చరిత్ర సృష్టించిన, కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ కు మంత్రి నిర్మల కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర భారీ పరిశ్రమలు శాఖ సహాయ మంత్రి,, వర్మ మాట్లాడుతూ, మరో ఆరు మాసాల్లో దివ్యంగులకు మరో విడత ఉపకరణాలు అందజేస్తామని, వచ్చే 2028 లో ఇదే స్థాయిలో వికలాంగులకు ఉపకరణాలు అందిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. దివ్యాంగుల అభివృద్ధి సంక్షేమం కోసం, ఆత్మగౌరవాన్ని కాపాడడానికి కూటమి ప్రభుతో కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమాన్ని, సమాధానం నిర్వహించడానికి గత రెండు రోజులుగా మంత్రి నిమ్మల రామానాయుడు విశేషంగా శ్రమించారు. దివ్యంగులకు కావలసిన అన్న పానీయాల ఏర్పాటు దగ్గరుండి చూసుకున్నారు. దివ్యాంగులతో కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఆత్మీయంగా మాట్లాడి, వారి సమస్యలు తెలుసుకున్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తో నదీ జలాల పంపిణీ పై సమావేశం ఉండటంతో ముఖ్యమంత్రి పిలుపు మేరకు నిమ్మల, హుటాహుటిన అమరావతికి తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగ రాణి, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ మోహన్ రావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కోడి విజయ భాస్కర్, గొట్టుముక్కల సూర్యనారాయణ రాజు, నరసాపురం ఆర్డిఓ దాసిరాజు, డీఎస్పీ సుధాకర్ రావు, తహసిల్దార్ ఎడ్ల దుర్గా కిషోర్ కూటమి నాయకులు, పెచ్చెట్టి బాబు, గండేటి వెంకటేశ్వరరావు, కర్నేని గౌరు నాయుడు, రోజరమణి, పెండ్యాల భవాణి, ఉన్నమట్ల కాపర్తి, కొల్లి కొండ ప్రసాద్, యర్రంశెట్టి పద్మారావు,తులా రామలింగేశ్వర రావు, రియా, బిట్టా లక్ష్మీ నారాయణ, పలువురు కూటమి నాయకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా, దివ్యంగులు తమ సంక్షేమం కోసం కృషి చేస్తున్న మంత్రి నిమ్మల రామానాయుడు ను ప్రశంసిస్తూ, పాడిన పాటలు ఆ కొట్టుకుని, ప్రముఖుల అభినందన లు అందుకున్నాయి.
