పాలకొల్లు: సెప్టెంబర్,17( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు కృషితో ఈ ఏడాది నవంబర్ నాటికి పట్టణంలో చెత్త సమస్యకు విముక్తి లభిస్తుందని కమిషనర్ దొడ్డా కిరణ్ కుమార్ గురువారం పత్రికలకు తెలిపారు. ఏళ్ల తరబడి పేరుకుపోయిన చెత్తను బయో మైనింగ్ పద్ధతి ద్వారా తొలగిస్తున్న ట్లు కమిషనర్ తెలిపారు. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ నిధులతో ప్రజారోగ్య శాఖ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం చురుగ్గా సాగుతుందని వివరించారు. ఎడ్ల బజార్లో ఉన్న దంపింగ్ యార్డ్ నుంచి 49.3 వేల మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించటానికి రెండు ప్రాసెసింగ్ ప్లాంట్లు తెలిపారు. సూర్య తేజస్ నగర్ వద్ద గల డంపింగ్ యార్డ్ నుంచి 63 వేల మెట్రిక్ టన్నుల చెత్త తొలగింపు ఇప్పటికే పూర్తయిందని పేర్కొన్నారు. ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయటానికి రూ. 5.08 కోట్లు మంజూరైనట్టు ప్రజా ఆరోగ్య శాఖ ఉప ఇంజనీర్ కు ఉత్తర్వులు అందాయన్నారు. వచ్చే అక్టోబర్ నాటికి ప్లాంట్ నిర్మాణం పూర్తి అవుతుందన్నారు. పట్టణంలో ప్రతిరోజు వస్తున్న 42 మెట్రిక్ టన్నుల చెత్తను రెండు డంపింగ్ యార్డ్ లకు తరలిస్తున్నట్టు వివరించారు.
నవంబర్ నాటికి చెత్త సమస్యకు విముక్తి. -కమిషనర్ దొడ్డా కిరణ్ కుమార్
కమిషనర్ దొడ్డా కిరణ్ కుమార్