పాలకొల్లు: ఏప్రిల్, 26(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక హౌసింగ్ బోర్డ్ లో గల యాక్ట్ (ఏ.సి.టి) సైన్స్ సెంటర్ లో వేసవి శిక్షణ తరగతులు సోమవారం నుంచి ప్రారంభిస్తున్నారు. ఈ తరగతులు ఉదయం గం. 9 నుంచి 11 వరకు జరుగుతాయి. ఈ తరగతుల్లో, శాస్త్రీయ భావనలు, శాస్త్ర ప్రయోగాలు, సైన్స్ మ్యాజిక్, వేద గణితం, చిత్రలేఖనం, హస్త కళలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ శిక్షణా కాలంలో ఈ విధమైన రుసుము చెల్లించనవసరం లేదు. ఈ తరగతులకు సంబంధించి వివరాలు ఈ క్రింది సెల్ నెంబర్ ల నుంచి పొందవచ్చు. 9849006368,9441073902
నేటి నుంచి ఉచిత వేసవి సైన్స్ తరగతులు.