నర్సాపురం: ఏప్రిల్, 26(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక రైల్వే స్టేషన్ నుంచి నరసాపురం – చర్లపల్లి (17061 / 17062) ఆదివారాల్లో నడిచే ఎక్స్‌ప్రెస్ రైలుకు ఆదివారం రాత్రి 8 గంటలకు స్థానిక పార్లమెంట్ సభ్యులు, కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో స్థానికఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ , నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ శ్రీ పొత్తూరి రామరాజు పాల్గొన్నారు.
నరసాపురం–హైదరాబాద్ మధ్య ప్రయాణ సౌకర్యాలను మెరుగుపరిచే దిశగా ప్రారంభమైన ఈ రైలు ఆధునిక కోచ్‌లు, అత్యాధునిక రేక్స్‌తో ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించనుంది.ఈ కొత్త రైలు సేవలు ప్రారంభం కావడంతో ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
చర్లపల్లి రైలు ప్రారంభించిన కేంద్రమంత్రి వర్మ.
చర్లపల్లి రైలుకు జండా ఊపి ప్రారంభిస్తున్న కేంద్రమంత్రి వర్మ, ఎమ్మెల్యే నాయకర్