పాలకొల్లు: ఏప్రిల్, 4(తెలుగు న్యూస్ పవర్. కామ్)
స్థానిక పంచారామ క్షేత్రం, ద శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద సోమవారం ఏడు మారేడు దళములతో, మాడ వీధులలో సప్తసోమవారముల సప్త ప్రదక్షిణాలు యందు సుమారు 300 మంది భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మీసాల రామచంద్ర రావు ,ఆలయ ప్రధాన అర్చకులు కిష్టప్ప , సూపరిండెంట్ పి. వాసు , ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. రాత్రి దూప సేవ, శ్రీ స్వామి వారికి పంచాహారతుల సేవ జరిగింది. కార్యనిర్వాహణాధికారి ముచ్చెర్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ సేవలు నిర్వహించారు.
పంచారామంలో సప్త ప్రదక్షిణలు.
సప్త ప్రదక్షిణలో పాల్గొన్న భక్తులు