Skip to main content

Telugu News Power

పశ్చిమ గోదావరి జిల్లాకు సొంత కలెక్టరేట్ భవనం నిర్మించాలి. -శాసనసభ దృష్టికి తెచ్చిన ఎమ్మెల్యే అంజిబాబు

శాసనసభలో ప్రశ్నిస్తున్న ఎమ్మెల్యే అంజిబాబు, సమాధానం ఇస్తున్న మంత్రి జనార్ధన రెడ్డి

భీమవరం: ఆగస్టు, 20( తెలుగు న్యూస్ పవర్.కామ్) పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రంగా భీమవరంగా ఏర్పడిన నాటి నుంచి కలెక్టరేట్ అద్దె భవనంలోను, ఎస్పీ కార్యాలయం రేకుల షెడ్డులో ఉన్నాయని, వాటికీ శాశ్వత పరిస్కారం లభించేలా సహకరించాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటి చైర్మన్, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు). గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో. సభ దృష్టికి తెచ్చారు. గత 3 ఏళ్ళుగా పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం ప్రధాన కేంద్రంగా ఉందని, భీమవరం ఎంతో అభివృద్ధి చెందుతుందని, విద్య, వైద్య, ఆక్వా రంగాలలో శరవేగంగా ముందుకు సాగుతుందని, అయినప్పటికి అద్దె భవనాల్లో జిల్లా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు ఉన్నాయని, సుమారు 20 ఎకరాల్లో ఈ భవనాలను నిర్మిచాలన్నారు. గతంలో మార్కెట్ యార్డ్ లో కలెక్టరేట్ నిర్మించాలని జీవో 124 వచ్చిందని, కలెక్టరేట్ అనేది ఒక భవనం కాదని, ఒక సముదాయమని, ప్రజలకు అనువైన, అందుబాటులో ఉండవలసిన కార్యాలయమన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు
2047 విజన్ ఆలోచనతో ముందుకు వెళుతున్నారని,
జిల్లా కేంద్రమైన భీమవరంలో అన్ని కార్యాలయాలు ఒకే కంపౌండ్ లో ఉండే విధంగా 20 ఎకరాల్లో ఒక కలెక్టరేట్ నిర్మించాలని, ఈ కలెక్టరేట్ ను ఏర్పాటు చేస్తే అన్ని సౌకర్యాలు సమకూరుతాయన్నారు. ఈ కలెక్టరేట్ నిర్మాణానికి సహకరించాలని, ఈ కలెక్టరేట్ శంకుస్థాపనను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా జరగాలని కోరుతున్నామని అన్నారు. భీమా ఉడా ఏర్పాటు చేయడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. ఇందుకు సంబంధించి రోడ్లు భవనాల శాఖ మాత్యులు బి సి జనార్ధన రెడ్డి సభకు వివరాలు తెలియజేస్తూ, రాష్ట్రంలో పోలీస్ జిల్లాలను కలెక్టరేట్ సముదాయాలు నిర్మించవలసి ఉందన్నారు. అన్నిటినీ పరిశీలించిన తర్వాత భవన నిర్మాణ ప్రక్రియకు శ్రీకారం చుడతామని బదులిచ్చారు.