Telugu News Power

పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏఎమ్ ఓ, చంద్రశేఖర్ తనిఖీ.

విద్యార్థులు తయారుచేసిన కళాకృతులను పరిశీలిస్తున్న అధికారులు

యలమంచిలి: జూలై, 14( తెలుగు న్యూస్ పవర్. కామ్)
రాష్ట్రవ్యాప్తంగా పీఎం శ్రీ పాఠశాల లను పర్యవేక్షించుటలో భాగంగా మంగళవారం దొడ్డిపట్ల,, పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల , జిల్లా ఏ ఎం ఓ సిహెచ్ చంద్రశేఖర్, యలమంచిలి మండలం ఎంఈఓ 1 జి వీరస్వామి సందర్శించారు.పాఠశాలలోని మౌలిక వసతులు లేబరేటరీ ,లైబ్రరీ ,స్కౌట్ అండ్ గైడ్స్, కిచెన్ గార్డెన్ ,కంపోస్ట్ ఫిట్ , రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ ,రైన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ ,ఒకేషనల్ ట్రేడ్స్ ,క్రాఫ్ట్ అండ్ ఆర్ట్ డ్రాయింగ్ లో విద్యార్థులు తయారుచేసిన పనిముట్లు , ఛార్ట్స్, పాల్ ల్యాబ్ లను పర్యవేక్షించి ఉపాధ్యాయులను అభినందించి కొన్ని సూచనలు చేశారు. విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. విద్యార్థులకు పీఎం శ్రీ పాఠశాల ఉద్దేశ్యం గురించి స్పష్టంగా వివరించారు. పీఎం శ్రీపారసాల లో చదివిన విద్యార్థులు మిగతా విద్యార్థులకు ఆదర్శంగానూ ప్రత్యేకంగాను ఉండాలని ఈ పాఠశాల మౌలిక వసతులను ప్రతి విద్యార్థి వినియోగించుకోవాలని జీవితంలో మెరుగైన జీవితాన్ని గడపడానికి ఈ పాఠశాల మీకు ఉపయోగపడాలని ఎంఈఓ 1 కోరారు. పి ఎం శ్రీ అనేది విద్యార్థి యొక్క సర్వతోముకాభివృద్ధికి తోడ్పడుతుంది అని జిల్లా ఎఎంఓ చంద్రశేఖర్ తెలియజేశారు.
తదనంతరం పాఠశాల సిబ్బందితో చర్చించి పలు సూచనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు ఆర్ఎస్ సత్యనారాయణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.