Telugu News Power

ముగిసిన ముద్రగడ శకం కాపు ఉద్యమ నేతగా కీర్తి శిఖరాలుకు.

ఇక సెలవు-ముద్రగడ
ముద్రగడ పద్మనాభం బోధికాయని ఆసుపత్రి నుంచి తరలిస్తున్న దృశ్యం

కాకినాడ: జులై, 14( తెలుగు న్యూస్ పవర్. కామ్) కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి, మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం (73) మంగళవారం తుది శ్వాస విడిచారు. అనారోగ్యం కారణంగా గత కొంతకాలంగా హైదరాబాదులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి కి చెందిన ముద్రగడ పద్మనాభం నాలుగు సార్లు శాసనసభ్యులుగా, ఒకసారి ఎంపీగా ఎన్నికయ్యారు. ఎన్టీఆర్, విజయ భాస్కర్ రెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు. కాపు ఉద్యమ నేతగా ఉభయ రాష్ట్రాల్లో కీర్తి గడించారు. కాపుల కోసం సైకిల్ యాత్ర చేసి ఉద్యమం నడిపారు. ముద్రగడ పిలుపుమేరకు తుని లక్షలాది మంది కాపులు చేరుకొని సభను విజయవంతం చేశారు. ఈ సందర్భంలో పుష్కర మొక్కలు చొరబడి రైలుకు నిప్పు పెట్టి ఉద్యమాన్ని ఆ బాస్ పాలు చేశారు. ఎందరో కాపీ యువత జైళ్ల పాలయ్యారు. ఆత్మ అభిమానం అధికంగా గల ముద్రగడ ప్రతి విషయంలోనూ అందుకోసం ఏ త్యాగానికైనా సిద్ధపడ్డారు. ఈ కారణం తోనే చివరిలో తన పేరును పద్మనాభ రెడ్డి గా మార్చుకున్నారు. ఉద్యమం సందర్భంగా స్వగృహంలో తనను తాను బంధించుకుని, ఎవరైనా చొరపడితే కాల్చుకుంటానని రాష్ట్రాన్ని హెచ్చరించారు. యువనేత తనను దూషించారని, తమ కుటుంబాన్ని వేధించారని ముద్రగడ పలు సందర్భాల్లో వాపోయారు. రాజశేఖర్ రెడ్డి తో ఉన్నాను బంధం కారణంగా భావించమని జగన్మోహన్ రెడ్డితో ఆయన సత్సంబంధాలు కొనసాగించారు. పవన్ కళ్యాణ్ తన ఇంటికి వస్తే జనసేనలో చేరే విషయం ఆలోచిస్తానని చెప్పిన ముద్రగడ జగన్మోహన్ రెడ్డి దగ్గరకు స్వయంగా వెళ్లి ఆ పార్టీలో చేరారు. ఆయనది వివాదస్పద మనస్తత్వం గా చాలాసార్లు వ్యక్తం అయింది. కన్న బిడ్డ క్రాంతి తన తండ్రిని తీవ్రంగా రాజకీయంగా వ్యతిరేకించారు. కాపుల రిజర్వేషన్ కోసం కృషిచేసి విజయభాస్కర్ రెడ్డికి స్వగ్రామం కిర్లంపూడి లో ఘన సత్కారం చేశారు. అయితే ఆ రిజర్వేషన్ ఈరోజు వరకు అమల్లోకి రాలేదు. ఈ సందర్భంగా ఉద్యమానికి రెడ్డి కులస్తులు సాయం చేశారని ముద్రగడ చేసిన ప్రకటన కాపుల్లో అసంతృప్తికి దారి తీసింది. కాపు ఉద్యమ నేతక కీర్తి శిఖరాలు అందుకున్న ముద్రగడ పద్మనాభం, పద్మనాభ రెడ్డి గా మారి కాపుల చీత్కారాలకు గురయ్యారు. అయినప్పటికీ ఇప్పటికీ ఆయనను ఇంకా అభిమానించే కాపులు ఎందరో నువ్వే రాష్ట్రాల్లోనూ ఉన్నారు. ముద్రగడ మృతికి ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రేవంత్ రెడ్డి సంతాపం తెలియజేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గవర్నర్ నజీర్ ప్రగాఢ విచారం వ్యక్తం చేశారు.