పాలకొల్లు: సెప్టెంబర్,26
(తెలుగు న్యూస్ పవర్.కామ్)
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో వేంచేసియున్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానము కార్యనిర్వహణాధికారిగా ఆర్.
శ్రీనివాసరావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్, విజయవాడ వారి ఉత్తర్వులు మేరకు విధుల్లో చేరినట్టు పత్రికలకు శనివారం వెల్లడించారు.
దేవాదాయ శాఖలో బదిలీలపై నిషేధం ఉన్నప్పటికీ, పెదగోపురం ఈవో బదిలీ పట్ల ఆయా వర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తం మవుతున్నది. ఈ బదిలీకి సంబంధించి తెర వెనుక గత కొంతకాలంగా అత్యున్నత స్థాయిలో ప్రయత్నం జరిగినట్టు చెబుతున్నారు. ఇంత వరకు ఈ బాధ్యతలు నిర్వర్తించిన ముచ్చర్ల శ్రీనివాసరావు ప్రస్తుతం సెలవులు వెళ్లినట్టు తెలస్తున్నది.
పెదగోపురం ఈ.వో. గా ఆర్. శ్రీనివాసరావు నియామకం.
నూతన ఈ. ఓ. ఆర్. శ్రీనివాస రావు.