Telugu News Power

పెద గోపురం మాడ వీధుల్లో సప్త ప్రదక్షిణలు.

సప్త ప్రదక్షిణలో పాల్గొన్న భక్తులు

పాలకొల్లు: మే,25(తెలుగు న్యూస్ పవర్. కామ్)స్థానిక శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద సోమవారం ఏడు మారేడు దళములతో మాడ వీధులలో, సప్తసోమవారముల సప్త ప్రదక్షిణాలలో సుమారు 270 మంది భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మీసాల రామచంద్ర రావు,ఆలయ ప్రధాన అర్చకులు కిష్టప్ప , సూపరిండెంట్ పి. వాసు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.తదుపరి రాత్రి దూప సేవ, శ్రీ స్వామి వారి పంచాహారతుల సేవ, కార్యనిర్వాహణాధికారి ముచ్చెర్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు.