Skip to main content

Telugu News Power

మంత్రి శ్రమదానంతో రుద్రభూమి పరిశుభ్రం.

లంకల కోడేరు స్మశాన వాటికలో చేస్తున్న మంత్రి నిమ్మల, అంగర

పాలకొల్లు: మే, 25 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక భగ్గేశ్వరం, లంకలకోడేరు గ్రామాల్లో కైలాస వనం వసతుల కల్పనకు రూ.65 లక్షలతో ప్రారంభించనున్న పనులకు స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు సోమవారం శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి గ్రామస్తులతో కలిసి లంకల కోడేరు స్మశాన వాటికను శ్రమదానం తో పరిశుభ్రం చేశారు. ప్రతి జీవికి ఆఖరి మజిలీ అయినా స్మశాన వాటిక ఆహ్లాదకరంగా ఉండటానికి సుందరీకరణ పనులు, సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. స్మశానం ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచడానికి కృషి చేయాలని సూచించారు. నియోజకవర్గ పరిధిలో ఉన్న అన్ని స్మశాన వాటికలు సుందరీకరణ, సౌకర్యాల కల్పనకు నిధుల కొరత ఉన్నప్పటికీ, ఇతరత్రా ప్రయత్నం చేసి సి ఎస్ ఆర్ నిధులతో కైలాస వనాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గత వైసిపి పాలన వల్ల రాష్ట్ర ప్రగతి పాతికేళ్ల వెనక్కు పోయిందని విమర్శించారు. అభివృద్ధి కోసం పాటుపడుతున్న కూటమి ప్రభుత్వాన్ని అస్థి ర పరచటానికి తమ కరపత్రిక ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారని, అవి ఫలించబోవుని నిమ్మల నొక్కి చెప్పారు. వైసిపి పార్టీ భూతాన్ని భూస్థాపితం చేస్తే గాని ఈ రాష్ట్రం బాగుపడదని ప్రజలు గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్రావు, ఏఎంసీ చైర్మన్ కోడి విజయభాస్కర్, మామిడి శెట్టి పెద్దిరాజు, పాముల రజిని కుమార్, చొప్పల రజిని, కోటి వీరభద్రరావు, బాబులు, లింగయ్య, కుక్కల సత్యనారాయణ, పెచ్చేట్టి నాని ,ఆకుల బ్రహ్మాజీ,పెనుమత్స శ్రీనివాసరాజు, నెక్కంటి దుర్గారావుఎంఈఓ గంగాధర శర్మ, సెక్రటరీ రాజేష్, పితాని గోపాలకృష్ణ, ఆదోని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.