Skip to main content

Telugu News Power

పోతనకు బహుమతి తెచ్చిన “జయహే”.

గుంటూరు/పాలకొల్లు: మే,5(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఉభయ తెలుగు రాష్ట్రాల నాటిక పోటీల్లో, ప్రముఖ సినీ,నాటక రచయిత, పాలకొల్లుకు చెందిన వీర పోతన రచించిన “జయహే” నాటిక ప్రధమ బహుమతి గెలుచుకుంది. గుంటూరు, కొలకలూరు నాటక పరిషత్ వారు ఈనాటికి పోటీలు నిర్వహించారు. పోతనకు 20వేల నగదు బహుమతి, షీల్డ్ ఇచ్చి పరిషత్ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సినీ నటులు గోపరాజు రమణ, విజయ్, పలువురు నాటకరంగ పాల్గొన్నారు. పాలకొల్లు పట్టణ ప్రముఖులు,నటీనట సమాఖ్య సభ్యులు కోతులుకు అభినందనలు తెలియజేశారు.