పాలకొల్లు: మే,5(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక లంకలకోడేరు గ్రామంలో అగ్ని బాధితులకు ధర్మారం ఫౌండేషన్ వారు మంగళవారం సాయం అందజేశారు. మూడు కుటుంబాల వారు ఈ అగ్ని ప్రమాదంలో నిరాశ్రయులయ్యారు. వీరికి 26 కేజీల బియ్యం, నిత్యవసర వస్తువులు, వంట సామాగ్రి, దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కోడి విజయభాస్కర్, పాముల రజిని కుమార్, ఆకుల ధనలక్ష్మి స్థానిక నాయకులు పాల్గొన్నారు.
ధర్మ రావు ఫౌండేషన్, అగ్ని బాధితులకు సాయం.
అగ్ని ప్రమాద బాధితులకు సహాయం అందజేస్తున్న దృశ్యం