Telugu News Power

ప్రపంచ తెలుగు ఖ్యాతికి ప్రతీక దాసరి. -మంత్రి నిమ్మల రామానాయుడు.

దాసరి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న అభిమానులు
దాసరికి నివాళులర్పిస్తున్న మంత్రి నిమ్మల

పాలకొల్లు: ఏప్రిల్, 4 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రపంచ తెలుగు ఖ్యాతికి దాసరి నారాయణరావు ప్రతీకని, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. దాసరి నారాయణరావు 79వ జన్మదినోత్సవం సందర్భంగా, సోమవారం, స్థానిక గాంధీ బొమ్మల సెంటర్ దగ్గర గల దాసరి నారాయణరావు కాంస్య విగ్రహం వద్ద ఘనంగా నివాళులర్పించారు. వంగ నరసింహారావు,యర్రం శెట్టి వెంకటరత్నం, మేడికొండ శ్రీనివాస్ చౌదరి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ సమాజానికి దశ దిశా నిర్దేశం చేసిన మహనీయుడు దాసరి అన్నారు. శతాధిక చిత్రాల దర్శకుడుగా, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ తో తెలుగు చలనచిత్ర రంగానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చి పెట్టారన్నారు. దర్శకుడిగా, నటుడిగా, మాటల, పాటల రచయితగా, నిర్మాతగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఆయన ప్రతిభ అనన్య సామాన్యమైనదన్నారు. దాసరి తీసిన చిత్రాలు, సమాజ రుగ్మతలను రూపుమాపడానికి, ప్రజలను చైతన్యపరచడానికి మార్గదర్శనంగా నిలిచాయన్నారు. దాసరి నారాయణరావు నిర్మించిన చిత్రాలు వాణిజ్య పరంగా కాక, సందేశాత్మక విలువలతో కూడినవన్నారు.దాసరి నారాయణరావు తెలుగువారు కావడం, పాలకొల్లు వారి మాతృభూమి కావటం మనందరికీ గర్వకారణం అన్నారు. రాజకీయ రంగంలో, కేంద్ర మంత్రిగా, పట్టణానికి చేసిన సేవలు కొనియాడారు. దాసరి ఆశయాలను కొనసాగించడానికి తామంతా కృషి చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో, యునైటెడ్ కాపు క్లబ్ అధ్యక్షులు పెనుమాక రామ్మోహన్రావు, అడబాల గ్రూప్ సంస్థల అధినేత అడబాల వెంకటరమణ, బిజెపి నాయకులు ఉన్నమట్ల కపర్తి,టిడిపి రాష్ట్ర నాయకులు పెచ్చెట్టి బాబు, సీనియర్ నటులు జీవి,సినీ రచయిత వీరా పోతన, నాటక రచయిత, నటులు తాళాబత్తుల వెంకటేశ్వరరావు, కఠారి నాగేంద్ర కుమార్, జక్కంపూడి కుమార్, కొల్లి కొండ ప్రసాద్, దర్శకులు కత్తుల రామ్మోహన్రావు, చుండూరి రంగయ్య నాయుడు, మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ శివాజీ, మండెల ఫణి, గుండుబోగుల వీరాస్వామి, కాలనాధభట్ల(ఎస్బిఐ) సుధీర్, చవాకుల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ చవాకుల సూర్య నరేష్, యాతం రమేష్, పాలకొల్లు నటి నటవర్గం సభ్యులు, దాసరి అభిమానులు ఈ కార్యక్రమంలో విశేషంగా పాల్గొన్నారు.