పాలకొల్లు:అక్టోబర్,8
(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆకుల గణపతి(71) రోడ్డు ప్రమాదంలో గురువారం మరణించారు. బ్రాడీపేట బైపాస్ రోడ్ లో ఈ ప్రమాదం సంభవించింది. మంచినీరు తెచ్చుకోవటానికి కుళాయి చెరువు వద్దకు గణపతి సైకిల్ పై వెళుతున్నారు. వేగంగా వస్తున్న లారీ ఈ వృద్ధుడిని వెనకనుంచి ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మృతుని భార్య నాగమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పట్టణ ఎస్ఐ పృద్వి పై వివరాలు పత్రికలకు వెల్లడించారు.
మంచినీటి కోసం వెళుతూ తిరిగిరాని లోకాలకు గణపతి. వెనుక నుంచి ఢీ కొట్టిన లారీ.
ప్రమాదంలో మరణించిన గణపతి మృతదేహం