విజయవాడ: జూన్, 29( తెలుగు న్యూస్ పవర్. కామ్)మహాకవి, పద్మభూషణ్ బోయి భీమన్న పురస్కారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ వారు సోమవారం ప్రదానం చేశారు. మంత్రి కందుల దుర్గేష్ , బోయి హైమావతి. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరు లక్ష్మీశ ఈ పురస్కారం ప్రదానం చేశారు. విజయవాడ కలెక్టరు కార్యాలయం లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జరిగిన భీమన్న జయంతి సభ నిర్వహించారు. నాటక అకాడేమి అధ్యక్షులు గుమ్మడి గోపాలకృష్ణ, జానపద కళల అకాడెమి అధ్యక్షులు గంగులయ్య , సాంస్కృతిక శాఖ సంచాలకులు రేగుళ్ల మల్లికార్జున రావు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు. సత్కారంతో పాటు రెండు లక్షల నగదు పురస్కారం అందజేశారు. ఈ సందర్భంగా పూర్ణచంద్ మాట్లాడుతూ, ఈ పురస్కారానికి ఎంపిక చేసిన ఎంపిక చేసిన హైమావతికి , ప్రభుత్వం వారికి కృతజ్ఞతలు తెలిపారు.
బహుగంధ కర్త పూర్ణచంద్ కు బోయి భీమన్న పురస్కారం.
పూర్ణచంద్ కు బోయి భీమన్న సత్కారం అందజేస్తున్న మంత్రి కందుల దుర్గేష్, కలెక్టర్ లక్ష్మీ షా