పాలకొల్లు: ఆగస్టు, 24( తెలుగు న్యూస్ పవర్. కామ్) బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ద్వారా 4జి ప్రీపెయిడ్ తగ్గింపు ధరలకు అందుబాటులోకి తెచ్చినట్టు జనరల్ మేనేజర్ రామరాజు వెల్లడించారు. స్థానిక బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం జిఎం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, బిఎస్ఎన్ఎల్ ఎంటర్ ప్రైస్ సొల్యూషన్స్ అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు. భారత్ ఫైబర్ ప్రతి ఇంటికి చేరేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. వ్యాపార అవసరాలకు అనుగుణంగా సీసీటీవీ సొల్యూషన్లు, మల్టీ కాస్టింగ్ సేవలు, ఐపి ఆధారిత వీడియో సర్వే లైన్లు, పాన్ ఇండియా నెట్ వర్క్, మేనేజ్ డ్ సర్వీస్, ఐపి కనెక్టివిటీ సొల్యూషన్లు, కష్టమైజ్ డ్ ఐవిఆర్ఎస్ తదితర సేవలు అందుబాటులో ఉన్నట్లు జి ఎం రామరాజు పేర్కొన్నారు. అధిక వేగం, ఏనెట్వర్క్ కైనా అపరిమిత ఇంటర్నెట్, వాయిస్ కాల్స్ ఉచితంగా ఇన్స్టిలేషన్ మోడెం కం వైఫై రౌటర్ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. వినియోగదారులు ఈ సేవలను సద్వినియోగ పరుచుకోవాలన్నారు . మొబైల్ ప్రీపెయిడ్ 4జీ ప్లాన్లకు సంబంధించి మాట్లాడుతూ ఎఫ్ఆర్సి 51 ప్లాన్ ఈనెలాఖరు వరకు మాత్రమే కొత్త కనెక్షన్ ఇస్తారన్నారు. ఈ సమావేశంలో డివిజనల్ ఇంజనీర్ కెవిఎపి సుబ్బారావు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పిఆర్ఓ వై.మోహన్ కృష్ణ, బిఎస్ఎన్ఎల్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
బిఎస్ఎన్ఎల్ 4జీ మొబైల్ ప్రీపెయిడ్ ధరలు తగ్గింపు -జనరల్ మేనేజర్ రామరాజు.
పత్రికా సమావేశంలో మాట్లాడుతున్న జిఎం రామరాజు