
కాకినాడ: ఆగస్టు, 24( తెలుగు న్యూస్ పవర్. కామ్) అసిస్టెంట్ ఇంజనీర్ నూకరాజు కుటుంబాన్ని వేధించి ఆత్మహత్యకు పురిగోల్పిన సాదిక్ ఖాన్ ఒక్కడే కాదని, అతని వెనుక తొమ్మిది మంది సభ్యుల ముఠాఉందని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సోమవారం సంచల ఆరోపణలు చేశారు. వీరు కాకినాడ, రాజమండ్రి పట్టణాల్లో 15 కుటుంబాల ఆస్తులను బలవంతంగా దోచుకున్నారని వెల్లడించారు. అసిస్టెంట్ ఇంజనీర్ నువ్వు ఒక రాజు చెందిన 40 కోట్ల విలువైన భూమిని, రెండు కోట్ల రూపాయల నగదు, రూ. 2 కోట్ల బంగారం బలవంతంగా లాక్కున్నారని ఆరోపించారు. సౌజన్య భర్త, జగదీశ్వర్ రెడ్డి కి విషమిచ్చి చంపి, బీమా సొమ్ము కాజేశారని తెలిపారు. కాకినాడ పోలీసులు మీరట్ నుంచి నిందితున్ని రైలు మార్గం ద్వారా కాకినాడ జిల్లా మేడపాడుకు ఆదివారం తీసుకువచ్చారు. సోమవారం ఆయన స్థానంలో హాజరు పరుస్తారని పోలీసులు తెలిపారు.