నర్సాపురం: ఆగస్టు,12( తెలుగు న్యూస్ పవర్. కామ్) కూటమి ప్రభుత్వం మూడు నెలలు తిరక్కుండానే రెండు జీవోలు తెచ్చి ఆక్వా రైతులను మోసం చేస్తున్నది మాజీ ఎమ్మెల్యే, వైసీపీ జిల్లా అధ్యక్షులు, నాయకుడు ముదునూరి ప్రసాద్ రాజు ఆరోపించారు. కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతా సభ మంగళవారం సభా పర్వం ముగిసిన తరువాత, వైసిపి పార్టీ నాయకుల విమర్శలపర్వం బుధవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా, ముదుమూరి మాట్లాడుతూ, కొత్తగా వచ్చిన జీవో ఆర్ టి నెంబర్ 57 వల్ల
ఆక్వా రైతులకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. జగన్ ప్రభుత్వంలో ఐదేళ్లపాటు, విద్యుత్ యూనిట్ కు రూ. 1.50 ల కు సబ్సిడీ కింద 3,800 కోట్ల రూపాయలు రైతులకు ప్రయోజనం చేకూర్చిందని వివరించారు. జీవో ప్రకారం అక్వా జోన్, నాన్-ఆక్వా తేడా లేకుండా సబ్సిడీ వర్తింప చేస్తున్నట్టు తెలిపారు అన్నారు. అయితే ఈ జీ ఓ లో కూటమి మెలిక పెట్టి రైతులకు వెన్నుపోటు పొడిచిందని ఆరోపించారు. జీవో లో ఎక్కడా పవర్ ఫ్యాక్టర్ గురించి స్పష్టం గా పేర్కొలేదన్నారు. పవర్ ఫ్యాక్టర్ 0.9-0.95 ఉంటే, ఇప్పుడు సబ్సిడీ అనుభవిస్తున్న రైతులకు కూడా ఉన్నది పోయే ప్రమాదం దాపురిస్తుందని వెల్లడించారు. వచ్చే మార్చిలోపు రైతులందరూ కెపాసిటర్లు అదనపు పెట్టుబడి తో ఏర్పాటు చేసుకోకపోతే సబ్సిడీ పోతున్నారు వివరించారు. ప్రస్తుత జీవో వల్ల కేవలం 20 శాతం మంది రైతులకు, 200 కోట్ల రూపాయల అదనపు సబ్సిడీ కోసం ఇచ్చిన జీవో కి ఇంత ఆర్భాటం చేశారని ఎద్దేవా చేశారు. ఫీడ్ ధరలు నాలుగు రూపాయలు తగ్గిస్తామని ప్రభుత్వం హామీ ఇస్తే, సిండికేట్లు ఎవరిని లెక్క చేయకుండా కేవలం రెండు రూపాయలు మాత్రమే తగ్గిస్తే ప్రభుత్వ పెద్దలు ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. కొత్తగా వచ్చిన జీవో ఉన్న రైతులకు ఏ ప్రయోజనం లేకుండా ప్రభుత్వం మోసం చేస్తుందని, నిజంగా రైతులకు మేలు జరిగితే, కృతజ్ఞతలు రైతులు తెలుపుతారన్నారు. గత జగన్ గొడ్డలి పార్టీ వల్ల రైతులకు నష్టం జరిగింది సభలు పెట్టి చెప్పారని, ప్రభుత్వం చేసింది వెన్నుపోటు కాదా, అని ప్రశ్నించారు. ఫీడు ధరలు తగ్గించి రైతులకు మేలు చేయాలని సూచించారు. దేశంలో ని ప్రతిష్టాత్మకమైన రెండు ఆక్వా యూనివర్సిటీలో ఒకటి నరసాపురానికి తీసుకువచ్చి, రైతులకు అవసరమైన ఆక్వా సాగుకు నిపుణుల తో రైతులకు మేలు చేయాలి చూస్తే యూనివర్శిటీకి కూటమి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా నిధులు మంజూరు చేయలేదని ఆరోపించారు
బూటకపు జీవోలతో రైతులకు కూటమి ప్రభుత్వం వెన్నుపోటు. -ముదునూరి ఘాటు విమర్శలు.