
తిరుపతి: జూలై, 18( తెలుగు న్యూస్ పవర్. కామ్)
హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ తయారు చేసిన విక్రమ్-1 రాకెట్ శనివారం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. దీంతో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో, ప్రైవేట్ రంగంలో అభివృద్ధి చేసిన మొట్టమొదటి కక్ష్యా రాకెట్‌ను ప్రయోగించిన మూడో దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది.
“మిషన్ ఆగమన్” పేరుతో చేపట్టిన ఈ ప్రయోగం, నాలుగు దశల్లో పూర్తిగా విజయవంతమైంది. అంతరిక్షంలోకి ఉపయోగించిన కేవలం 15-17 నిమిషాల్లోనే పేలోడ్‌లను 450 కిలోమీటర్ల కక్ష్యలోకి కచ్చితంగా ప్రవేశపెట్టింది. దాదాపు 22 మీటర్ల ఎత్తు ఉన్న ఈ రాకెట్, 350 కిలోల వరకు పేలోడ్‌లను తక్కువ భూ కక్ష్య లోకి మోసుకెళ్లగలదు.
ఈ చారిత్రాత్మక విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ, స్కైరూట్ యువ శాస్త్రవేత్తల బృందానికి అభినందనలు తెలిపారు. మొదటి ప్రయత్నంలోనే స్వదేశీ నిర్మాణం, స్వదేశీ పరిజ్ఞానంతో ఈ ఘనత సాధించడం యువ భారత శాస్త్రవేత్తల సామర్థ్యానికి నిదర్శనమని కొనియాడారు. ఈ సంస్థ
2018లో స్థాపించబడిన స్కైరూట్ ఏరోస్పేస్, ఇప్పటికే భారత అంతరిక్ష రంగంలో బిలియన్ డాలర్ల విలువ దాటిన మొట్టమొదటి కంపెనీగా నిలిచింది. ఈ ప్రయోగం భారత్‌ను గ్లోబల్ కమర్షియల్ లాంచ్ మార్కెట్‌లో బలమైన పోటీదారుగా నిలబెట్టనుంది. రాష్ట్ర ఐటి విద్యాశాఖ మార్చుట నారా లోకేష్ తన కుమారుడు కలిసి ఉల్లాపూర్వ దృశ్యాన్ని ప్రత్యక్షంగా పాల్గొని వీక్షించారు. విక్రమ్ వన్ ప్రయోగం విజయవంతమైన సందర్భంగా శాస్త్రవేత్తలను మంత్రి అభినందించారు.
భారత అంతరిక్ష చరిత్రలో సరికొత్త అధ్యాయం – విక్రమ్-1 విజయవంతం.
విక్రమ్ 1 విజయంతో హర్షాతిరేకాలు