పాలకొల్లు: జులై, 18( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక
వైసీపీ కార్యాలయంలో శనివారం జగన్ 2.0 సూపర్ యాప్ పోస్టర్ ను పార్టీ నాయకులు ఆవిష్కరించారు. పార్టీ కార్యక్రమాలు, కార్యకర్తల కోసం ఈ యాప్ రూపకల్పన చేశారు. క్షేత్ర స్థాయిలో ప్రజలు ఎదురుకొంటున్న సమస్యలు, కార్యకర్తలు పడుతున్న ఇబ్బందులు, పార్టీ కార్యక్రమాలు వంటివి అన్ని ఈ యాప్ లో ఉంటాయని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్,గుడాల శ్రీహరి గోపాలరావు ఆధ్వర్యంలో, పట్టణ వైకాపా అధ్యక్షులు,కోరాడ శ్రీనివాస్,యలమంచిలి మండల వైకాపా అధ్యక్షులు, ఉచ్చుల స్టాలిన్, మండల ఎంపీపీ వినకొండ ధనలక్ష్మి రవికుమర్ ఆధ్వర్యంలో యాప్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో,బాకురు సత్య నిరంజనరావు,కెల్లా పెద్దిరాజు, మోర్త గిరీష్,జోగి వెంకటేశ్వరరావు,మద్దా చంద్రకళ,రొక్కాల మేరీ,వాసా విజయ,రాపాక శివప్రసాద్,
శర్మ,పశువులేటి రమేష్,వీర మల్లికార్జునరావు,పిల్లా శ్రీనివాస్,కోళ్ల వెంకట్,కళ్యాణం గంగాధర్,బాబి,శ్రీరామ్,రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ మరియు మండల వివిధ అనుబంధ కమిటీ అధ్యక్షులు నాయకులు.పాల్గొన్నారు.
వైసిపి శ్రేణుల కోసం జగన్ వదిలిన బ్రహ్మాస్త్రం 2.0 సూపర్ యాప్.
యాప్ ఆవిష్కరణలో పాల్గొన్న వైసీపీ నాయకులు