Skip to main content

Telugu News Power

మంచినీటి సరఫరా లోపాలపై మంత్రి నిమ్మల ఆగ్రహం.

మంచినీటి సరఫరాపై సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న మంత్రి నిమ్మల.
మంత్రి నిమ్మల క్షేత్రస్థాయి పర్యటనలోకుళాయి చెరువు మంచినీటి లభ్యతపై పరిశీలన.

పాలకొల్లు: మే, 17 తెలుగు న్యూస్ పవర్. కామ్)
బ్రిటిష్ కాలం నుంచి ఉన్న చెరువులు విస్తీర్ణం పెంచాలని, అప్పటి ఎమ్మెల్యే బంగారు ఉషారాణి, తాము ప్రయత్నాలు చేసినప్పటికీ ఒకే చోట 50-60 ఎకరాల స్థలం దొరక్కపోవటం వల్ల పట్టణంలో నీటి సమస్య ఇప్పటికీ ఉందని శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మ నాయుడు వివరించారు. ప్రస్తుత ఏడాది రూ.397 కోట్ల రూపాయలతో కాలువల పనులు జరుగుతున్నందున
45 రోజులు కాలువల కట్టుబడి ఉందన్నారు. గత జగన్ ప్రభుత్వం కాలవల గురించి పట్టించుకోకపోవడం వల్ల నీటి సరఫరా సమస్య రాలేదన్నారు. వచ్చే జూన్ మొదటి వారంలో కాలువలకు నీరు రావచ్చని అభిప్రాయపడ్డారు. మంచినీటి చెరువుల్లో నీటిమట్టం 4 అడుగులు పడిపోయినందున నీటి వినియోగం పట్ల జాగ్రత్త వహించాలని కోరారు. ప్రత్యామ్నాయంగా మంచినీటి బోర్లు వేయటం, జున్నూరు నుంచి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయటం వంటి జల వనరుల గురించి అన్వేషించాలని సూచించారు. పురప్రజలు నీటిని వృధా చేయవద్దని కోరారు. రెండేళ్ళలో రూ.760 కోట్ల నిధులతో విజ్జేశ్వరం నుంచి నేరుగా పైపులైన్ ద్వారా వివిధ పట్టణాలకు మంచినీరు అందించే ప్రాజెక్టు పనులు చురుగ్గా సాగుతున్నాయన్నారు. కూటమి ప్రభుత్వం లో ప్రజలకు మంచినీటి సరఫరా చేయటం మొదటి ప్రాధాన్యత అంశం అని పేర్కొన్నారు. మంచినీటి సరఫరాకు సంబంధించిన అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం, నిర్లిప్తత తో ఉంటున్నారని తన పరిశీలనలో తేలిందన్నారు. ప్రభుత్వానికి ఇచ్చే లెక్కలకు, క్షేత్రస్థాయి అసలు లెక్కలకు పొంతన లేదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పుడున్న నీటి లభ్యతను బట్టి పది రోజులుకు మాత్రమే నీటి సరఫరా చేయగలమన్నారు . ప్రజలు నీటిని పొదుపుగా వాడి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇళ్లపై ఉన్న నీటి ట్యాంకులు నిండిపోయి రక్షిత మంచినీరు వృధాగా మురుగు కాల్వలలోకి పోవటాన్నితాను గమనించానని, కొత్తగా ఇల్లు కడుతున్న వారు తడపటానికి తాగునీరు వాడవద్దని, జనరేటర్ల ద్వారా మోటార్లతో మంచినీరు తోడటం వల్ల మంచినీటికి సామాన్య ప్రజలు ఇబ్బంది పడవలసి వస్తుందని గమనించాలని కోరారు. స్థానిక మహాత్మా గాంధీ మున్సిపల్ సమావేశ మందిరంలో ఆదివారం అత్యవసరంగా జరిగిన ఈ సమావేశంలో, కమిషనర్ బి. విజయ సారథి, ప్రజారోగ్య శాఖ, సి ఈ సుధాకర్ రావు, ఎస్ ఈ రత్నాకర్ రెడ్డి, ఇంజనీరింగ్ అధికారులు, విజయ్, రాజ్ కుమార్, ఏ ఈ లు, కూటమి నాయకులు, మాజీ కౌన్సిలర్లు పెచ్చెట్టి బాబు, గండేటి వెంకటేశ్వరరావు, ధనాని సూర్య ప్రకాష్,, బిజెపి నాయకులు ఉన్నమట్ల కపర్తి, జక్కంపూడి కుమార్, కొల్లి కొండ ప్రసాద్, బందెల భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.