Telugu News Power

నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటా. మంత్రి నిమ్మల.

జున్నూరులో శంకుస్థాపన చేస్తున్న మంత్రి నిమ్మల
సభా వేదిక దిగి వెళ్ళిపోతున్న మంత్రి నిమ్మల రామానాయుడు

ఫోడూరు: మే, 17(తెలుగు న్యూస్ పవర్. కామ్)
ముమ్మారు పాలకొల్లు నియోజకవర్గం నుంచి గెలిపించిన ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తానని మంత్రి నిమ్మల పేర్కొన్నారు. స్థానిక జిన్నూరు లో అభివృద్ధి పనులకు రూ.2.49 కోట్లు, వేడంగిలో రూ.43.70 లక్షలు మట్టపర్రు అభివృద్ధి పనులకు రూ. 83 లక్షలు మొత్తం
రూ .3.76 కోట్ల తో 15 అభివృద్ధి పలుకు రామానాయుడు ఆదివారం శంకుస్థాపనలు చేశారు. మట్టపర్రులో ఈ సందర్భంగా బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ రైతుల కోసం రూ.1.75 కోట్లతో గ్రావెల్ రోడ్డు నిర్మించినట్లు తెలిపారు. జల జీవన్ మిషన్ నిధులు రూ.1.27 కోట్లతో స్వచ్ఛమైన తాగు నీరుకు నిధులు అందించమన్నాను. పాలకొల్లు-మార్టేరు నుంచి మట్టపర్రుకు రూ 1.85 కోట్లతో రోడ్డు నిర్మిస్తామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలొ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమపథకాలు అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో, ఏఎంసీ చైర్మన్ కోడి విజయభాస్కర్, దాసరి రత్నం రాజు, పాలవలస తులసీరావు, గొట్టుముక్కల సూర్యనారాయణ రాజు, దేవల ప్రసాద్, కోటి మోహన్, పెనుమత్స రామభద్ర రాజు, ఉన్నమట్ల కపర్తి, చొప్పల శ్రీనివాస్ శ్రీనివాస్, ఎల్లమిల్లి వెంకటరావు, మల్లాడి విష్ణు, కోట్టి రామం, గుబ్బల శ్రీరామ్, జక్కం శెట్టి మధు బొలిశెట్టి మంగయ్య నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

మంత్రి సభలో వైసిపి నాయకుల వీరంగం.

మంత్రి నిమ్మల రామానాయుడు,
మట్టపర్రు సభలో మాట్లాడుతున్న చివరి దశలో స్థానిక వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు రోడ్డు కోసం వినతిపత్రంతో వచ్చి మంత్రితో వాగ్వివాదానికి దిగారు. అంతకుముందే మంత్రి రోడ్డు గురించి, నిధులు మంజూరు గురించి సభలో ప్రకటించారు. అయినప్పటికీ, ముందస్తు ప్రణాళికతో వచ్చిన వైసీపీ నాయకులు మంత్రి సభలో గందరగోళం సృష్టించాలని ప్రయత్నం చేశారు. ఇందుకు మంత్రి ఘాటుగా స్పందించారు. గతంలో పదవులు అనుభవించిన వారు ఉన్నప్పుడు రోడ్డు ఎందుకు వేయించుకోలేకపోయారని వైసీపీ వారిని నిలదీశారు. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు ఐదేళ్లు కళ్ళు మూసుకు కూర్చున్నారా అని మంత్రి మండిపడ్డారు. ఇలాంటి బురద చల్లే వైసిపి కుట్రలు,కుతంత్రాలు ప్రజలు గమనిస్తున్నారని, వారే బుద్ధి చెబుతారని అన్నారు. అవసరమైతే రోడ్డు సొంత నిధులతో నిర్మిస్తానని మంత్రి హామీ ఇవ్వడంతో గ్రామస్తులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. వైసిపి నాయకుల సృష్టించిన చికాకు సంఘటనతో ఆగ్రహించిన మంత్రి వేదిక దిగి వెళ్ళిపోయారు. గ్రామస్తులు ఎంత పట్టు పట్టిన మంత్రి వేదిక పైకి రాలేదు.